Vaadavaari meppimchavalemgaa neegu

వాడవారి మెప్పించవలెఁగా నీకు
Language

(॥పల్లవి॥)
వాడవారి మెప్పించవలెఁగా నీకు
వాడుదేరి మాటలాడవలెఁగా నీకు

(॥వాడ॥)
చెలియవలపు నీ చిత్తానఁ బట్టకుండినా
వలరాచపాది చూడవలెఁగా నీకు
సెలవులనగవులు జిగి మించకుండినాను
బలిమిఁ దెచ్చుకొనైనా వలెఁగా నీకు

(॥వాడ॥)
యీ వనితవూడిగాలు యింపులు గాకుండినాను
వావికి సరస మాడవలెఁగా నీకు
చేవదేరియాసలు చిమ్మి రేఁగ కుండినాను
వావాత మొగమోట వలెఁగా నీకు

(॥వాడ॥)
తరుణిపై తలఁపు లాతల నీకు నుండినాను
వరునకుఁ గౌఁగిలించవలెఁగా నీకు
యిరవై శ్రీవేంకటేశ యింత సేసి కూడితివి
వరుఁడవైన కీర్తి వలెఁగా నీకు

(||pallavi||)
vāḍavāri mĕppiṁchavalĕm̐gā nīgu
vāḍuderi māḍalāḍavalĕm̐gā nīgu

(||vāḍa||)
sĕliyavalabu nī sittānam̐ baṭṭaguṁḍinā
valarāsabādi sūḍavalĕm̐gā nīgu
sĕlavulanagavulu jigi miṁchaguṁḍinānu
balimim̐ dĕchchugŏnainā valĕm̐gā nīgu

(||vāḍa||)
yī vanidavūḍigālu yiṁpulu gāguṁḍinānu
vāvigi sarasa māḍavalĕm̐gā nīgu
sevaderiyāsalu simmi rem̐ga kuṁḍinānu
vāvāda mŏgamoḍa valĕm̐gā nīgu

(||vāḍa||)
taruṇibai talam̐pu lādala nīgu nuṁḍinānu
varunagum̐ gaum̐giliṁchavalĕm̐gā nīgu
yiravai śhrīveṁkaḍeśha yiṁta sesi kūḍidivi
varum̐ḍavaina kīrdi valĕm̐gā nīgu