Vaadarottudanamele vanidalagu

వాతరొట్టుదనమేలే వనితలకు
Language

(॥పల్లవి॥)
వాతరొట్టుదనమేలే వనితలకు
నీతితో మెలఁగితేనే నిన్ను మెచ్చీఁ గాక

(॥వాత॥)
పగటులు చూపిచూపి పలుమారు నవ్వేవు
మగనితో నేమిటికి మందెమేళాలు
మొగము చూపి చేయెత్తి మొక్కితేను మేలెరిఁగి
తగలి యాతఁడే నీపై దయసేసీఁగాక

(॥వాత॥)
వాలుకచూపులఁ జూచి వాసులకుఁ బెనఁగేవు
యేలినవానితోనేలే యెగసక్కేలు
తాలిమితో సేవసేసి దండనే కాచుకుండితే
పాలించి యాతఁడే నిన్నుఁ బైకొనీఁగాక

(॥వాత॥)
చలములు సాదించి చన్నులనేల వోతైవు
బలువునితోనేలే పాడిపంతాలు
అలమేలుమంగవిభుఁడుగు శ్రీవేంకటేశ్వరు-
కొలువుసేయఁగఁ దానే కోరి కూడీఁగాక

(||pallavi||)
vādarŏṭṭudanamele vanidalagu
nīdido mĕlam̐gidene ninnu mĕchchīm̐ gāga

(||vāda||)
pagaḍulu sūbisūbi palumāru navvevu
maganido nemiḍigi maṁdĕmeḽālu
mŏgamu sūbi seyĕtti mŏkkidenu melĕrim̐gi
tagali yādam̐ḍe nībai dayasesīm̐gāga

(||vāda||)
vālugasūbulam̐ jūsi vāsulagum̐ bĕnam̐gevu
yelinavānidonele yĕgasakkelu
tālimido sevasesi daṁḍane kāsuguṁḍide
pāliṁchi yādam̐ḍe ninnum̐ baigŏnīm̐gāga

(||vāda||)
salamulu sādiṁchi sannulanela vodaivu
baluvunidonele pāḍibaṁtālu
alamelumaṁgavibhum̐ḍugu śhrīveṁkaḍeśhvaru-
kŏluvuseyam̐gam̐ dāne kori kūḍīm̐gāga