వాదము లేఁటికి వలసిన వారికి
(॥పల్లవి॥)
వాదము లేఁటికి వలసిన వారికి
వేదము గలుగఁగ వెల్లివిరాయ
(॥వాదము॥)
దైవం బొకఁడె తత్త్వ జ్ఞానికి
భావింపఁ బలువురు భ్రాంతునికి
వేవేలకు మరి విత్తు వొక్కటే ఆది
కావఁగఁ బూవఁగ ఘనమైనట్లు
(॥వాదము॥)
భువి సాకారము పూర్ణ జ్ఞానికి
ఆవల నిరవయవ మధమునికి
అవళు గలిగికా అష్టపుత్రులును
భవములు శ్రీహరిపాలనె కలిగె
(॥వాదము॥)
శరణాగతియే శాస్త్రజ్ఞానికి
సరవిఁ గర్మమె జడునికిని
నిరతి శ్రీవేంకటనిలయు మాయ లివి
యిర వెఱుఁగు వారి కిహమే పరము
(||pallavi||)
vādamu lem̐ṭigi valasina vārigi
vedamu galugam̐ga vĕllivirāya
(||vādamu||)
daivaṁ bŏgam̐ḍĕ tattva jñānigi
bhāviṁpam̐ baluvuru bhrāṁtunigi
vevelagu mari vittu vŏkkaḍe ādi
kāvam̐gam̐ būvam̐ga ghanamainaṭlu
(||vādamu||)
bhuvi sāgāramu pūrṇa jñānigi
āvala niravayava madhamunigi
avaḽu galigigā aṣhṭabutrulunu
bhavamulu śhrīharibālanĕ kaligĕ
(||vādamu||)
śharaṇāgadiye śhāstrajñānigi
saravim̐ garmamĕ jaḍunigini
niradi śhrīveṁkaḍanilayu māya livi
yira vĕṟum̐gu vāri kihame paramu