Vaadamela saaresaare vadi mukti ledamtaa

వాదమేల సారెసారె వడి ముక్తి లేదంటా
Language

(॥పల్లవి॥)
వాదమేల సారెసారె వడి ముక్తి లేదంటా
వేదాంతశ్రవణము వెట్టికిఁ జేసిరా

(॥వాద॥)
అరయ జీవులకెల్లా నభేదమైతే
గురుఁడు శిష్యులు లేఁడు కూడ దర్థము
సొరిది నాతుమలోన సోహంభావనయైతే
సరి మునుల దేవపూజలు చెల్లవు

(॥వాద॥)
సహజలీలావిభూతి సర్వము మిథ్య యైతే
బహుయాగాది కర్మాల పస లేదు
మహిలోని జననాలు మరణాలు మాయమైతే
విహితాచారాలు సేయ విధే లేదు

(॥వాద॥)
ఘటన బ్రహ్మము నిరాకార మైతేఁ బఠియింప
యిటు పురుషసూక్తాదు లివి మరేల
అటు శ్రీవేంకటేశుదాస్యము లేక బిగిసితే
సటలాడుకొనేడి రాక్షసమత మవును

(||pallavi||)
vādamela sārĕsārĕ vaḍi mukti ledaṁṭā
vedāṁtaśhravaṇamu vĕṭṭigim̐ jesirā

(||vāda||)
araya jīvulagĕllā nabhedamaide
gurum̐ḍu śhiṣhyulu lem̐ḍu kūḍa dardhamu
sŏridi nādumalona sohaṁbhāvanayaide
sari munula devabūjalu sĕllavu

(||vāda||)
sahajalīlāvibhūdi sarvamu mithya yaide
bahuyāgādi karmāla pasa ledu
mahiloni jananālu maraṇālu māyamaide
vihidāsārālu seya vidhe ledu

(||vāda||)
ghaḍana brahmamu nirāgāra maidem̐ baṭhiyiṁpa
yiḍu puruṣhasūktādu livi marela
aḍu śhrīveṁkaḍeśhudāsyamu lega bigiside
saḍalāḍugŏneḍi rākṣhasamada mavunu