Vaadamela saare saare vadi mukti ledamte

వాదమేల సారె సారె వడి ముక్తి లేదంటె
Language

(॥పల్లవి॥)
వాదమేల సారె సారె వడి ముక్తి లేదంటె
వేదాంతశ్రవణము వెట్టికిఁ జేసేరా

(॥వాద॥)
అరయ ప్రపంచమెల్ల నభేద మయితే
గురుఁడు శిష్యుడు లేఁడు కూడ దర్థము
సొరిది నాత్మలోన సోహంభావన యయితే
సరి మును దేవ పూజలు చెల్లవు

(॥వాద॥)
సహజలీలావిభూతి సర్వం మిధ్య యయితే
బహు యాగాదికర్మము పనిలేదు
మహిలోని జననము మరణము మాయ యయితే
విహితాచారము సేయ విధిలేదు

(॥వాద॥)
ఘటన బ్రహ్మము నిరాకార మయితేఁ బఠియింప
యిటు పురుషసూక్తాదు లివి నీకేల
అటు శ్రీ వేంకటేశు ద్యానము లేక బిగిసితే
సటలాడుకొనేటి రాక్షమత మవును

(||pallavi||)
vādamela sārĕ sārĕ vaḍi mukti ledaṁṭĕ
vedāṁtaśhravaṇamu vĕṭṭigim̐ jeserā

(||vāda||)
araya prabaṁchamĕlla nabheda mayide
gurum̐ḍu śhiṣhyuḍu lem̐ḍu kūḍa dardhamu
sŏridi nātmalona sohaṁbhāvana yayide
sari munu deva pūjalu sĕllavu

(||vāda||)
sahajalīlāvibhūdi sarvaṁ midhya yayide
bahu yāgādigarmamu paniledu
mahiloni jananamu maraṇamu māya yayide
vihidāsāramu seya vidhiledu

(||vāda||)
ghaḍana brahmamu nirāgāra mayidem̐ baṭhiyiṁpa
yiḍu puruṣhasūktādu livi nīgela
aḍu śhrī veṁkaḍeśhu dyānamu lega bigiside
saḍalāḍugŏneḍi rākṣhamada mavunu