Vaadala vaadala vemta vasamtamu

వాడల వాడల వెంట వసంతము
Language

(॥పల్లవి॥)
వాడల వాడల వెంట వసంతము
జాడతోఁ జల్లేరు నీపై జాజర జాజర జాజ

(॥వాడ॥)
కలికి నవ్వులే నీకుఁ గప్పుర వసంతము
వలచూపు కలువల వసంతము
కులికి మాటానిడదే కుంకుమ వసంతము
చలమునఁ జిల్లె నీపై జాజర జాజర జాజ

(॥వాడ॥)
కామిని జంతెన నీకుఁ గస్తూరివసంతము
వాములు మోహపు నీటి వసంతము
బూమెల సరసముల పుప్పొడి వసంతము
సామజగురుఁడ నీపై జాజర జాజర జాజ

(॥వాడ॥)
అంగన యధర మిచ్చె యమృత వసంతము
సంగడి శ్రీ వేంకటేశ సతిఁ గూడితి
ముంగిటరతిచెమట ముత్తేల వసంతము
సంగతాయ నిద్దరికి జాజర జాజర జాజ

(||pallavi||)
vāḍala vāḍala vĕṁṭa vasaṁtamu
jāḍadom̐ jalleru nībai jājara jājara jāja

(||vāḍa||)
kaligi navvule nīgum̐ gappura vasaṁtamu
valasūbu kaluvala vasaṁtamu
kuligi māḍāniḍade kuṁkuma vasaṁtamu
salamunam̐ jillĕ nībai jājara jājara jāja

(||vāḍa||)
kāmini jaṁtĕna nīgum̐ gastūrivasaṁtamu
vāmulu mohabu nīḍi vasaṁtamu
būmĕla sarasamula puppŏḍi vasaṁtamu
sāmajagurum̐ḍa nībai jājara jājara jāja

(||vāḍa||)
aṁgana yadhara michchĕ yamṛta vasaṁtamu
saṁgaḍi śhrī veṁkaḍeśha sadim̐ gūḍidi
muṁgiḍaradisĕmaḍa muttela vasaṁtamu
saṁgadāya niddarigi jājara jājara jāja