ఉవిద విరహమున నొంటిపడె । మన
(॥పల్లవి॥)
ఉవిద విరహమున నొంటిపడె । మన-
కివల నీకెతో నిది యేపాటు
(॥ఉని॥)
చిత్తము చెదరఁగ చెంత పూవుల
నెత్తులుగట్టీని లేమ
యిత్తలనత్తల నెడనెడ దండలు
గుత్తము రారో కొమ్మకుఁదాడు
(॥ఉని॥)
పాసి విభునితో బాదంబున భువి
వ్రాసెఁ జిత్తరువు వగఁ దరుణి
యీసతిచెలులము యింక వేమైనాఁ
జేసినచేఁత చేయకపోదు
(॥ఉని॥)
గాదిలి శ్రీవేంకటఁతి కాంగిట
సేదుదేరము చెలియకును
మోద మిప్పుడుగా మొనకొనె మనకును
యేదెస నుంటిమి యిందాఁకాను
(||pallavi||)
uvida virahamuna nŏṁṭibaḍĕ | mana-
kivala nīgĕdo nidi yebāḍu
(||uni||)
sittamu sĕdaram̐ga sĕṁta pūvula
nĕttulugaṭṭīni lema
yittalanattala nĕḍanĕḍa daṁḍalu
guttamu rāro kŏmmagum̐dāḍu
(||uni||)
pāsi vibhunido bādaṁbuna bhuvi
vrāsĕm̐ jittaruvu vagam̐ daruṇi
yīsadisĕlulamu yiṁka vemainām̐
jesinasem̐ta seyagabodu
(||uni||)
gādili śhrīveṁkaḍam̐ti kāṁgiḍa
seduderamu sĕliyagunu
moda mippuḍugā mŏnagŏnĕ managunu
yedĕsa nuṁṭimi yiṁdām̐kānu