ఉత్తమనాయకురాలి కోజ యిదియేకాదా
(॥పల్లవి॥)
ఉత్తమనాయకురాలి కోజ యిదియేకాదా
చిత్తగించి నీ సేవ సేయించుకోవయ్యా
(॥ఉత్త॥)
యెల్లవారిలోనా నేరాలెంచఁగఁజాలక నిన్ను
చల్లనిచూపులనే సాదించీని
వల్లదానఁ బెనఁగుతా బలమిచూపఁజాలక
వొల్లనే కొసరుతా నిన్నొడివట్టీని
(॥ఉత్త॥)
మనసు నాఁటంగ నిన్ను మాటలాడఁజాలక
ననుపుసేసుక నీతో నవ్వు నవ్వీని
చెనకుచు నిన్నుఁ గడుసిగ్గువరచఁజాలక
మొనగోరు సొఁకకుండా మొక్కు మొక్కీని
(॥ఉత్త॥)
చలముల నీతోను సాదించఁజాలక
కలపుకోలుఁదనానఁ గాఁగిలించీని
చెలి నేలితి విన్నిటా శ్రీవేంకేటేశ్వర
సోలయఁజాలక రతిఁ జోక్కించీని
(||pallavi||)
uttamanāyagurāli koja yidiyegādā
sittagiṁchi nī seva seyiṁchugovayyā
(||utta||)
yĕllavārilonā nerālĕṁcham̐gam̐jālaga ninnu
sallanisūbulane sādiṁchīni
valladānam̐ bĕnam̐gudā balamisūbam̐jālaga
vŏllane kŏsarudā ninnŏḍivaṭṭīni
(||utta||)
manasu nām̐ṭaṁga ninnu māḍalāḍam̐jālaga
nanubusesuga nīdo navvu navvīni
sĕnagusu ninnum̐ gaḍusigguvarasam̐jālaga
mŏnagoru sŏm̐kaguṁḍā mŏkku mŏkkīni
(||utta||)
salamula nīdonu sādiṁcham̐jālaga
kalabugolum̐danānam̐ gām̐giliṁchīni
sĕli nelidi vinniḍā śhrīveṁkeḍeśhvara
solayam̐jālaga radim̐ jokkiṁchīni