ఉత్తమనాయకుఁడవు వువిదల యడాటాన
(॥పల్లవి॥)
ఉత్తమనాయకుఁడవు వువిదల యడాటాన
బత్తిసేయనివాఁడవా పదరితిఁగాక
(॥ఉత్త॥)
నన్ను నీవు మఱచేవా నాలోనితమకమున
పన్ని చెలులచేఁ జెప్పిపంపుదుఁగాక
మన్నించకుండుదువా మనసుపట్టఁగలేక
విన్నపములెల్లాఁ జేసి వేగిరింతుఁగాక
(॥ఉత్త॥)
కరుణించవా నీవు కాఁకల కోర్వఁగలేక
విరుల నెచ్చరికగా వేతుఁగాక
పరగ నింటికి రాక పరాకులు సేతువా
సరి నిన్ను రమ్మనుచు సారెఁ బిలిచేఁగాక
(॥ఉత్త॥)
చన వీయవా నీవు సారె సారెఁ బెనఁగుతా
చెనకి ప్రియము నీకు జెప్పేఁగాక
నిను శ్రీవేంకటేశ్వర నే నలమేలు మంగను
యెనసితి నిందుకుఁగా నెఱిఁగింతుఁగాక
(||pallavi||)
uttamanāyagum̐ḍavu vuvidala yaḍāḍāna
battiseyanivām̐ḍavā padaridim̐gāga
(||utta||)
nannu nīvu maṟasevā nālonidamagamuna
panni sĕlulasem̐ jĕppibaṁpudum̐gāga
manniṁchaguṁḍuduvā manasubaṭṭam̐galega
vinnabamulĕllām̐ jesi vegiriṁtum̐gāga
(||utta||)
karuṇiṁchavā nīvu kām̐kala korvam̐galega
virula nĕchcharigagā vedum̐gāga
paraga niṁṭigi rāga parāgulu seduvā
sari ninnu rammanusu sārĕm̐ bilisem̐gāga
(||utta||)
sana vīyavā nīvu sārĕ sārĕm̐ bĕnam̐gudā
sĕnagi priyamu nīgu jĕppem̐gāga
ninu śhrīveṁkaḍeśhvara ne nalamelu maṁganu
yĕnasidi niṁdugum̐gā nĕṟim̐giṁtum̐gāga