(॥పల్లవి॥)
ఉచిత మెఱఁగవద్దా వువిదలకు
రచనల నీసరి రారా యెవ్వరును
(॥॥)
యింతులెల్లా నిలుచుండి యిట్టెకొలువు సేయఁగ
మంతనములాడేవు మగనితోను
జంతవై నీవొకతెవే జట్టిగొంటివా యేమి
వంతువరుసలు మరివలదా యెవ్వరికి
(॥॥)
సవతు లిందరును మీసరుసనే వుండఁగాను
పవళించే వీతనిపానుపుమీఁద
కవగూఁడగా నీకే కాణాచాయనా యేమి
తవిలి నీసాటికి రాఁదగదా యెవ్వరికి
(॥॥)
తోడివా రెల్లా నట్టెవూడిగాలు సేయఁగాను
వేడుకఁ గూడితివి శ్రీ వేంకటేశుని
కూడిమాడి నీవే రతిఁ గొల్ల గొంటివా యేమి
వోడక నీవంటియాస వుండదా యెవ్వరికి
(||pallavi||)
usida mĕṟam̐gavaddā vuvidalagu
rasanala nīsari rārā yĕvvarunu
(||||)
yiṁtulĕllā nilusuṁḍi yiṭṭĕgŏluvu seyam̐ga
maṁtanamulāḍevu maganidonu
jaṁtavai nīvŏgadĕve jaṭṭigŏṁṭivā yemi
vaṁtuvarusalu marivaladā yĕvvarigi
(||||)
savadu liṁdarunu mīsarusane vuṁḍam̐gānu
pavaḽiṁche vīdanibānubumīm̐da
kavagūm̐ḍagā nīge kāṇāsāyanā yemi
tavili nīsāḍigi rām̐dagadā yĕvvarigi
(||||)
toḍivā rĕllā naṭṭĕvūḍigālu seyam̐gānu
veḍugam̐ gūḍidivi śhrī veṁkaḍeśhuni
kūḍimāḍi nīve radim̐ gŏlla gŏṁṭivā yemi
voḍaga nīvaṁṭiyāsa vuṁḍadā yĕvvarigi