ఉన్నవెల్లా మానరే వువిదలార
(॥పల్లవి॥)
ఉన్నవెల్లా మానరే వువిదలార
వెన్నుఁడే నా మగఁడు వెసఁ బొందు శాయరే
(॥ఉన్న॥)
చెప్పరే వానిసుద్దులు చెవులపండుగగాను
విప్పైనంసంతోసాన వినే నేను
చొప్పులెత్తిచూపరే సూటి వానియడుగులు
వొప్పుగఁ జూచి వేడుక నోలలాడే నేను
(॥ఉన్న॥)
యియ్యరే వానితమ్ముల మిసుమంతయినాఁదెచ్చి
చెయ్యారాఁ బుక్కిటఁ బెట్టి చెలఁగే నేను
పుయ్యరే వానిమేనఁ బూసినగందము నాకు
నెయ్యపు సంతోసాన నిండుకుండే నేను
(॥ఉన్న॥)
పట్టరే వానిపాదాలు పిక్కటిల్లేచన్నులపై
గుట్టుననే కాఁగిలించుకొనే నేను
యిట్టె శ్రీవేంకటేశుఁడతఁడే వచ్చిన న్నేలె
చుట్టపువరుస నిఁక జోడువాయ నేను
(||pallavi||)
unnavĕllā mānare vuvidalāra
vĕnnum̐ḍe nā magam̐ḍu vĕsam̐ bŏṁdu śhāyare
(||unna||)
sĕppare vānisuddulu sĕvulabaṁḍugagānu
vippainaṁsaṁtosāna vine nenu
sŏppulĕttisūbare sūḍi vāniyaḍugulu
vŏppugam̐ jūsi veḍuga nolalāḍe nenu
(||unna||)
yiyyare vānidammula misumaṁtayinām̐dĕchchi
sĕyyārām̐ bukkiḍam̐ bĕṭṭi sĕlam̐ge nenu
puyyare vānimenam̐ būsinagaṁdamu nāgu
nĕyyabu saṁtosāna niṁḍuguṁḍe nenu
(||unna||)
paṭṭare vānibādālu pikkaḍillesannulabai
guṭṭunane kām̐giliṁchugŏne nenu
yiṭṭĕ śhrīveṁkaḍeśhum̐ḍadam̐ḍe vachchina nnelĕ
suṭṭabuvarusa nim̐ka joḍuvāya nenu