Unnavaarim dadavenaa voorage nenu

ఉన్నవారిఁ దడవేనా వూరకె నేను
Language

(॥పల్లవి॥)
ఉన్నవారిఁ దడవేనా వూరకె నేను
పన్ని యిట్టె తలపోసి భావించుకోవయ్యా

(॥ఉన్న॥)
నీ యింతిపైఁ గోపించుట నీమీఁది వల పది
ఆయెడ వారిఁ దిట్టుట అది నీనుతి
చేయెత్తి సేసినచేఁత చెక్కులు నీకు నొక్కుట
పాయపు విభుఁడ ఇట్టె భావించుకోవయ్యా

(॥ఉన్న॥)
వెంగెము నీసతి నాడుట వేడుక నీమీఁదిది
కంగి యాపె కలుగుట కైకొంట నిన్ను
కొంగువట్టి తీసుటెల్లా కూరుములే కొసరుట
పంగెన గా దిపు డిట్టె భావించుకోవయ్యా

(॥ఉన్న॥)
సారె నీకాంత దూరుట సమ్మతి నిన్నుఁ జేసుట
వారిఁ దప్పకచూచుట వాడికె నీది
యీరీతి శ్రీ వేంకటేశ ఇటు నన్నుఁ గూడితివి
భారము వేసుటగాదు భావించుకోవయ్యా

(||pallavi||)
unnavārim̐ daḍavenā vūragĕ nenu
panni yiṭṭĕ talabosi bhāviṁchugovayyā

(||unna||)
nī yiṁtibaim̐ gobiṁchuḍa nīmīm̐di vala padi
āyĕḍa vārim̐ diṭṭuḍa adi nīnudi
seyĕtti sesinasem̐ta sĕkkulu nīgu nŏkkuḍa
pāyabu vibhum̐ḍa iṭṭĕ bhāviṁchugovayyā

(||unna||)
vĕṁgĕmu nīsadi nāḍuḍa veḍuga nīmīm̐didi
kaṁgi yābĕ kaluguḍa kaigŏṁṭa ninnu
kŏṁguvaṭṭi tīsuḍĕllā kūrumule kŏsaruḍa
paṁgĕna gā dibu ḍiṭṭĕ bhāviṁchugovayyā

(||unna||)
sārĕ nīgāṁta dūruḍa sammadi ninnum̐ jesuḍa
vārim̐ dappagasūsuḍa vāḍigĕ nīdi
yīrīdi śhrī veṁkaḍeśha iḍu nannum̐ gūḍidivi
bhāramu vesuḍagādu bhāviṁchugovayyā