ఉన్నమాట లిఁకనేల వూరకే యెందాఁకనైనా
(॥పల్లవి॥)
ఉన్నమాట లిఁకనేల వూరకే యెందాఁకనైనా
విన్నపాలు సేసేము వేడుకిదే చాలదా
(॥ఉన్న॥)
సేస వెట్టినప్పుడే చేకొనుటాయ నన్ను
వాసులవరుసవంతు వలెనా నాకు
రాసికెక్కనప్పుడే రమ్మని పిలిచె నన్ను
నాసరివారిలోన నాకుఁ జాలదా
(॥ఉన్న॥)
కన్నులఁ జూచినప్పుడే కైవస మైతిఁ దనకు
వన్నెల నన్నాదరించవలెనా నాకు
యిన్నిటా నాభాగ్యమాయ నింతలో నన్నాదరించె
కన్నెనై పుట్టినందుకు ఘనతిదే చాలదా
(॥ఉన్న॥)
చెక్కునొక్కినప్పుడే సిరులెల్లఁ జేరెనాకు
వక్కణించి సొమ్ములియ్యవలెనా నాకు
యిక్కువంటి శ్రీవేంకటేశుఁడిట్టె నన్నుఁ గూడె
మిక్కిలి నవ్విన యీసమేళమె చాలదా
(||pallavi||)
unnamāḍa lim̐kanela vūrage yĕṁdām̐kanainā
vinnabālu sesemu veḍugide sāladā
(||unna||)
sesa vĕṭṭinappuḍe segŏnuḍāya nannu
vāsulavarusavaṁtu valĕnā nāgu
rāsigĕkkanappuḍe rammani pilisĕ nannu
nāsarivārilona nāgum̐ jāladā
(||unna||)
kannulam̐ jūsinappuḍe kaivasa maidim̐ danagu
vannĕla nannādariṁchavalĕnā nāgu
yinniḍā nābhāgyamāya niṁtalo nannādariṁchĕ
kannĕnai puṭṭinaṁdugu ghanadide sāladā
(||unna||)
sĕkkunŏkkinappuḍe sirulĕllam̐ jerĕnāgu
vakkaṇiṁchi sŏmmuliyyavalĕnā nāgu
yikkuvaṁṭi śhrīveṁkaḍeśhum̐ḍiṭṭĕ nannum̐ gūḍĕ
mikkili navvina yīsameḽamĕ sāladā