ఉన్నతిసుఖాన నీ వుండిఁతే జాలు వట్టి
(॥పల్లవి॥)
ఉన్నతిసుఖాన నీ వుండిఁతే జాలు వట్టి-
యెన్నికల కెక్కించేది యేల మాకు దోసము
(॥ఉన్న॥)
ఇక్కడికి రాఁగాను యేమని తిట్టునో చెలి
అక్కడ నుండే మాటలాడవయ్య
పక్కన నా పెలిగితే పాసి నీ వుండఁగ లేవు
యెక్కువ ని న్నింత సేసే దేల మా కీదోసము
(॥ఉన్న॥)
యిట్టె నామోము చూడఁగ నెంత సాదించునో నిన్ను
వట్టిసిగ్గుతోఁ దలవంచుకోవయ్య
యెట్టైనా నాపెతో నీవు యెదురు మాటాడ లేవు
యెట్టకేల కొకమాఁటు యేల మా కీ దోసము
(॥ఉన్న॥)
కాఁగిట నన్నుఁ గూడేవు కనునో యేమో ఆపె
వీఁగక గొబ్బనఁ దెర వేయవయ్య
లోఁగక శ్రీవేంకటేశ లోలుఁడ వైతివి నాకు
యేఁగర యిట్టె వుండు యేల మా కీ దోసము
(||pallavi||)
unnadisukhāna nī vuṁḍim̐te jālu vaṭṭi-
yĕnnigala kĕkkiṁchedi yela māgu dosamu
(||unna||)
ikkaḍigi rām̐gānu yemani tiṭṭuno sĕli
akkaḍa nuṁḍe māḍalāḍavayya
pakkana nā pĕligide pāsi nī vuṁḍam̐ga levu
yĕkkuva ni nniṁta sese dela mā kīdosamu
(||unna||)
yiṭṭĕ nāmomu sūḍam̐ga nĕṁta sādiṁchuno ninnu
vaṭṭisiggudom̐ dalavaṁchugovayya
yĕṭṭainā nābĕdo nīvu yĕduru māḍāḍa levu
yĕṭṭagela kŏgamām̐ṭu yela mā kī dosamu
(||unna||)
kām̐giḍa nannum̐ gūḍevu kanuno yemo ābĕ
vīm̐gaga gŏbbanam̐ dĕra veyavayya
lom̐gaga śhrīveṁkaḍeśha lolum̐ḍa vaidivi nāgu
yem̐gara yiṭṭĕ vuṁḍu yela mā kī dosamu