Unna vemee guṟigaavu voddanumdi neevu naado

ఉన్న వేమీ గుఱిగావు వొద్దనుండి నీవు నాతో
Language

(॥పల్లవి॥)
ఉన్న వేమీ గుఱిగావు వొద్దనుండి నీవు నాతో
అన్న మాటలే గుఱుతు అప్పటికప్పటికి

(॥ఉన్న॥)
చూపులకు గుఱుతు నీసోయగమైనమేను
తీపులకు గురి నీతేనెమోవి
కోపములకు గురి నీగొరిమదనరేకలే
చేపట్లకు గుఱి నీచెట్టాపట్టాలే

(॥ఉన్న॥)
చిత్తమునకు గుఱుతు సేసేటినీచేఁతలే
హత్తి నాకు గురి అంటుఁగాఁగిలి
మొత్తపు నవ్వుకు గురి ముంచిననీసుద్దులే
గుత్తపువలపులకు గురి నీమోహములు

(॥ఉన్న॥)
పంతముల కెల్లా గురి పరచినపానుపే
సంతసములకు గురి సరసములే
ఇంతలో శ్రీ వేంకటేశ ఇట్టె నన్నుఁ గూడితివి
మంతనాలకెల్లా గురి మతిపరవశమే

(||pallavi||)
unna vemī guṟigāvu vŏddanuṁḍi nīvu nādo
anna māḍale guṟudu appaḍigappaḍigi

(||unna||)
sūbulagu guṟudu nīsoyagamainamenu
tībulagu guri nīdenĕmovi
kobamulagu guri nīgŏrimadanaregale
sebaṭlagu guṟi nīsĕṭṭābaṭṭāle

(||unna||)
sittamunagu guṟudu seseḍinīsem̐tale
hatti nāgu guri aṁṭum̐gām̐gili
mŏttabu navvugu guri muṁchinanīsuddule
guttabuvalabulagu guri nīmohamulu

(||unna||)
paṁtamula kĕllā guri parasinabānube
saṁtasamulagu guri sarasamule
iṁtalo śhrī veṁkaḍeśha iṭṭĕ nannum̐ gūḍidivi
maṁtanālagĕllā guri madibaravaśhame