Unna vallaa nadumdanee vodda nilusumdanee

ఉన్న వల్లా నటుండనీ వొద్ద నిలుచుండనీ
Language

(॥పల్లవి॥)
ఉన్న వల్లా నటుండనీ వొద్ద నిలుచుండనీ
కన్నులకు నిధానము గలిగెఁ గా నీకు

(॥ఉన్న॥)
యేపొద్దు నాపె నీవు యెదఁ గట్టుకొ నుండఁగ
తీపుల నీపాలిటి దేవ రాయఁగా
యీపాటి వారి వీరి నెలయించి యీసు రేఁచ
కాపాడి చెప్పి చూపఁ గలిగెఁ గా నీకు

(॥ఉన్న॥)
చేతికి లో నై యాపె చెప్పినట్టె సేసేవు
యీతల నిన్ను వంచుకో నేలి కాయఁగా
రీతిగా సింగారించి రేయిఁ బగలుఁ దాలార్చ
ఘాతల సింగారబొమ్మ గలిగెఁ గా నీకూ

(॥ఉన్న॥)
చీ మంత మా టైన చెవిలో నీకు బోదించు
కోమలి నీ కిన్నాళ్లను గురు తాయఁగా
యీ మేర శ్రీవెంకటేశ యిద్దరి మమ్ముఁ గూడితి
కామించి మేకులు సేయఁ గలిగెఁ గా నీకు

(||pallavi||)
unna vallā naḍuṁḍanī vŏdda nilusuṁḍanī
kannulagu nidhānamu galigĕm̐ gā nīgu

(||unna||)
yebŏddu nābĕ nīvu yĕdam̐ gaṭṭugŏ nuṁḍam̐ga
tībula nībāliḍi deva rāyam̐gā
yībāḍi vāri vīri nĕlayiṁchi yīsu rem̐sa
kābāḍi sĕppi sūbam̐ galigĕm̐ gā nīgu

(||unna||)
sedigi lo nai yābĕ sĕppinaṭṭĕ sesevu
yīdala ninnu vaṁchugo neli kāyam̐gā
rīdigā siṁgāriṁchi reyim̐ bagalum̐ dālārsa
ghādala siṁgārabŏmma galigĕm̐ gā nīgū

(||unna||)
sī maṁta mā ṭaina sĕvilo nīgu bodiṁchu
komali nī kinnāḽlanu guru tāyam̐gā
yī mera śhrīvĕṁkaḍeśha yiddari mammum̐ gūḍidi
kāmiṁchi megulu seyam̐ galigĕm̐ gā nīgu