Unna vaarilona neevoo nogade vimte

ఉన్న వారిలోన నీవూ నొకతె వింతే
Language

(॥పల్లవి॥)
ఉన్న వారిలోన నీవూ నొకతె వింతే
మన్ననలు గలిగితే మాఁటలు నీ కేఁటికే

(॥ఉన్న॥)
చేరి తమరమణుఁడు చెప్పినట్టు సేసేవారు
ఆరసి వెంగేలు వేరే ఆడవచ్చేరా
ఆరీతి నాతఁడే తమఅంకెలకు రాకుండితే
దూరుదురు మీరుదురు తుచ్చము నీ కేఁటికే

(॥ఉన్న॥)
తక్కక తమపతుల దక్కఁ గొని నట్టివారు
తెక్కులను నమ్మక సాదించ వచ్చేరా
వొక్కట్టె వారె తమ వొడఁబాటుకు రాకున్న
చిక్కింతురు చొక్కింతురు చెనక నీ కేఁటికే

(॥ఉన్న॥)
మచ్చిక తమవిభుని మరిగించినట్టివారు
నిచ్చలు నెన్నఁడై నా నేర మెంచేరా
యిచ్చల శ్రీవేంకటేశుఁ డెనసి నన్నిదె మీరె
మెచ్చింతురు హెచ్చింతురు మేకు లిఁక నేఁటికే

(||pallavi||)
unna vārilona nīvū nŏgadĕ viṁte
mannanalu galigide mām̐ṭalu nī kem̐ṭige

(||unna||)
seri tamaramaṇum̐ḍu sĕppinaṭṭu sesevāru
ārasi vĕṁgelu vere āḍavachcherā
ārīdi nādam̐ḍe tamaaṁkĕlagu rāguṁḍide
dūruduru mīruduru tuchchamu nī kem̐ṭige

(||unna||)
takkaga tamabadula dakkam̐ gŏni naṭṭivāru
tĕkkulanu nammaga sādiṁcha vachcherā
vŏkkaṭṭĕ vārĕ tama vŏḍam̐bāḍugu rāgunna
sikkiṁturu sŏkkiṁturu sĕnaga nī kem̐ṭige

(||unna||)
machchiga tamavibhuni marigiṁchinaṭṭivāru
nichchalu nĕnnam̐ḍai nā nera mĕṁcherā
yichchala śhrīveṁkaḍeśhum̐ ḍĕnasi nannidĕ mīrĕ
mĕchchiṁturu hĕchchiṁturu megu lim̐ka nem̐ṭige