ఉన్న సుద్దులకు నీవు వొనఁగూడేవా
(॥పల్లవి॥)
ఉన్న సుద్దులకు నీవు వొనఁగూడేవా
కన్నుల జంకెనలకే కాఁతాళించేవు
(॥ఉన్న॥)
పెనఎగేలివాఁడ వేల పిలువ నంపితి నన్ను
వొనరిన చేఁత కెల్లా నోరువ వద్దా
మనసు రాదో కాక మాతోడి పొందు నీకు
కొనగోరితాఁకులకె కోపగించేవు
(॥ఉన్న॥)
సిగ్గువడేవాఁడ వేల చెనకితి విటు నన్ను
యెగ్గు లేక నామాటల కియ్యకో వద్దా
వెగ్గళించి నానవ్వు వేసటాయనో కాక
దగ్గరి మా తిట్లకే తలవంచేవు
(॥ఉన్న॥)
కడునలసే వాఁడవు కాగిట నేల కూడితి
జడియని నారతికి సరిగా వద్దా
అడరి శ్రీవేంకటేశ అలమేలుమంగ నేను
వొడలు సోకినందుకే వూరకే చొక్కేవు
(||pallavi||)
unna suddulagu nīvu vŏnam̐gūḍevā
kannula jaṁkĕnalage kām̐tāḽiṁchevu
(||unna||)
pĕnægelivām̐ḍa vela piluva naṁpidi nannu
vŏnarina sem̐ta kĕllā noruva vaddā
manasu rādo kāga mādoḍi pŏṁdu nīgu
kŏnagoridām̐kulagĕ kobagiṁchevu
(||unna||)
sigguvaḍevām̐ḍa vela sĕnagidi viḍu nannu
yĕggu lega nāmāḍala kiyyago vaddā
vĕggaḽiṁchi nānavvu vesaḍāyano kāga
daggari mā tiṭlage talavaṁchevu
(||unna||)
kaḍunalase vām̐ḍavu kāgiḍa nela kūḍidi
jaḍiyani nāradigi sarigā vaddā
aḍari śhrīveṁkaḍeśha alamelumaṁga nenu
vŏḍalu soginaṁduge vūrage sŏkkevu