Ummagilevaari nela vudigimcheene

ఉమ్మగిలేవారి నేల వుడికించీనే
Language

(॥పల్లవి॥)
ఉమ్మగిలేవారి నేల వుడికించీనే
తమ్మిమోము చూచి నాపై దయ వెట్టఁదగదా

(॥ఉమ్మ॥)
చెక్కుచేతఁ దనకుఁగా చింతతో నేనుండఁగాను
యెక్కడనుండో వచ్చి యేల నవ్వీనే
ముక్కున నూర్పులతోడ ములుగుచు నుండఁగాను
పొక్కక తానేల నన్ను పువ్వుల వేసీనే

(॥ఉమ్మ॥)
నేరక నే తనుఁ బాసి నేలలు వ్రాయఁగాను
సారెఁ దా వచ్చి అదేమి చదివీనే
వేరులేక పానుపు పై వెతలఁబొరలఁగాను
యీరీతి నింకా సన్నలేమిసేసీనే

(॥ఉమ్మ॥)
దిమ్ము రేఁగి కాఁకలతో దేహమెల్ల వాడ గాఁను
యెమ్మెలఁ గాఁగిట నన్ను నేల పట్టీనే
కమ్మి శ్రీవేంకటపతి గక్కున నన్నుఁ గూడి
చెమ్మఁజెమటలఁ నన్నుఁ జెక్కులేల నొక్కీనే

(||pallavi||)
ummagilevāri nela vuḍigiṁchīne
tammimomu sūsi nābai daya vĕṭṭam̐dagadā

(||umma||)
sĕkkusedam̐ danagum̐gā siṁtado nenuṁḍam̐gānu
yĕkkaḍanuṁḍo vachchi yela navvīne
mukkuna nūrbuladoḍa mulugusu nuṁḍam̐gānu
pŏkkaga tānela nannu puvvula vesīne

(||umma||)
neraga ne tanum̐ bāsi nelalu vrāyam̐gānu
sārĕm̐ dā vachchi ademi sadivīne
verulega pānubu pai vĕdalam̐bŏralam̐gānu
yīrīdi niṁkā sannalemisesīne

(||umma||)
dimmu rem̐gi kām̐kalado dehamĕlla vāḍa gām̐nu
yĕmmĕlam̐ gām̐giḍa nannu nela paṭṭīne
kammi śhrīveṁkaḍabadi gakkuna nannum̐ gūḍi
sĕmmam̐jĕmaḍalam̐ nannum̐ jĕkkulela nŏkkīne