ఉమ్మడినే యేమనినా నూరకుండను
(॥పల్లవి॥)
ఉమ్మడినే యేమనినా నూరకుండను
అమ్మరో యెంతట గబ్బి యనకుమీ నన్నును
(॥॥)
మాటలు నీవాడితేను మంచితేనెలు గారీని
గాటమై నీచేఁతలై తే కారమయ్యీని
యీటువెట్టితేఁ జవి యిదొకటీ నదొకటీ
కూటమికౌ ననరాదు కోపగించ రాదు
(॥॥)
కన్నుల నీవు చూచితే కడు వెన్నెల గాసీని
యెన్నబోతే నీసుద్దులు యెండ గాసీని
పన్ని నవి నీ గుణాలు వచ్చియును వెచ్చియును
అన్నీఁ జేతఁబట్టరాదు అటు దోయరాదు
(॥॥)
నీవాసలు వెట్టితేను నిలువు నూరువండీని
భావించ నీ సింగారాలు పాలుకొనీని
యీవల శ్రీవేంకటేశ యింతలో నన్నేలితివి
చేవదేరె ననరాదు చిగురనరాదు
(||pallavi||)
ummaḍine yemaninā nūraguṁḍanu
ammaro yĕṁtaḍa gabbi yanagumī nannunu
(||||)
māḍalu nīvāḍidenu maṁchidenĕlu gārīni
gāḍamai nīsem̐talai te kāramayyīni
yīḍuvĕṭṭidem̐ javi yidŏgaḍī nadŏgaḍī
kūḍamigau nanarādu kobagiṁcha rādu
(||||)
kannula nīvu sūside kaḍu vĕnnĕla gāsīni
yĕnnabode nīsuddulu yĕṁḍa gāsīni
panni navi nī guṇālu vachchiyunu vĕchchiyunu
annīm̐ jedam̐baṭṭarādu aḍu doyarādu
(||||)
nīvāsalu vĕṭṭidenu niluvu nūruvaṁḍīni
bhāviṁcha nī siṁgārālu pālugŏnīni
yīvala śhrīveṁkaḍeśha yiṁtalo nannelidivi
sevaderĕ nanarādu siguranarādu