Ummadine vumdinatte vumdaniyyaraa

ఉమ్మడినే వుండినట్టే వుండనియ్యరా
Language

(॥పల్లవి॥)
ఉమ్మడినే వుండినట్టే వుండనియ్యరా
కమ్మి మైనఁ బైఁడికత వో నా పొందులు

(॥ఉమ్మ॥)
మట్టులేక నీవు నన్ను మాటలాడించకురా
గట్టి వజ్రపుదంతాలగని మానోరు
చెట్టముట్టి నీవు నన్నుఁ జెమరించకురా
వెట్టయయిన వలపులవెల్లి వో నామేను

(॥ఉమ్మ॥)
మాటలాడి నీవు నన్ను మరిగింపించకురా
కాటుక కన్నుల గీము గందు నామోము
ఆఁటదానఁ బెనఁగి నన్నలయింపించకురా
గాఁటపుటెఱ్ఱని గోళ్లగాతలు నాచేతులు

(॥ఉమ్మ॥)
బచ్చెనరతుల నన్ను భ్రమయింపించకురా
మచ్చుల పాయములోని మంపు నామతి
ఇచ్చట శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
నిచ్చ కల్యాణమునకు నెలవు నా వంతము

(||pallavi||)
ummaḍine vuṁḍinaṭṭe vuṁḍaniyyarā
kammi mainam̐ baim̐ḍigada vo nā pŏṁdulu

(||umma||)
maṭṭulega nīvu nannu māḍalāḍiṁchagurā
gaṭṭi vajrabudaṁtālagani mānoru
sĕṭṭamuṭṭi nīvu nannum̐ jĕmariṁchagurā
vĕṭṭayayina valabulavĕlli vo nāmenu

(||umma||)
māḍalāḍi nīvu nannu marigiṁpiṁchagurā
kāḍuga kannula gīmu gaṁdu nāmomu
ām̐ṭadānam̐ bĕnam̐gi nannalayiṁpiṁchagurā
gām̐ṭabuḍĕṭrani goḽlagādalu nāsedulu

(||umma||)
bachchĕnaradula nannu bhramayiṁpiṁchagurā
machchula pāyamuloni maṁpu nāmadi
ichchaḍa śhrīveṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
nichcha kalyāṇamunagu nĕlavu nā vaṁtamu