Umgaramu seedavoddi kogi nampinavaanigi

ఉంగరము సీతవొద్ది కొగి నంపినవానికి
Language

(॥పల్లవి॥)
ఉంగరము సీతవొద్ది కొగి నంపినవానికి
వుంగరాలు వేళ్లనిండా మెనరించరే

(॥ఉంగర॥)
మద్దులు విఱచిన మనపిన్నక్రిష్ణునికి
మద్దికాయ లమరు నెమ్మదిఁ బెట్టరే
గద్దించి రావిమానై కాంతలఁ బొందేవానికి
ముద్దుగారే రావిరేక ముంగురులఁ గట్టరే

(॥ఉంగర॥)
ఘంటాకర్ణునిభక్తి గైకొనేటివానికి
ఘంటలు మొలనూళ్లుఁ గట్టరమ్మా
గెంటక గోరనే దైత్యుగీరి చంపినవీనికి
జంట పులిగోరు మెడఁజక్క గట్టరే

(॥ఉంగర॥)
పాదముననే బండి పడఁ దన్నినవీనికి
పాదపుగజ్జలందెలు వాని యిడరే
గోదిలి గోవర్దనపుఁగొండ యెత్తినవానికి
యీదెస శ్రీవేంకటాద్రి యెక్కి యాడఁదగునే

(||pallavi||)
uṁgaramu sīdavŏddi kŏgi naṁpinavānigi
vuṁgarālu veḽlaniṁḍā mĕnariṁchare

(||uṁgara||)
maddulu viṟasina manabinnakriṣhṇunigi
maddigāya lamaru nĕmmadim̐ bĕṭṭare
gaddiṁchi rāvimānai kāṁtalam̐ bŏṁdevānigi
muddugāre rāvirega muṁgurulam̐ gaṭṭare

(||uṁgara||)
ghaṁṭāgarṇunibhakti gaigŏneḍivānigi
ghaṁṭalu mŏlanūḽlum̐ gaṭṭarammā
gĕṁṭaga gorane daityugīri saṁpinavīnigi
jaṁṭa puligoru mĕḍam̐jakka gaṭṭare

(||uṁgara||)
pādamunane baṁḍi paḍam̐ danninavīnigi
pādabugajjalaṁdĕlu vāni yiḍare
godili govardanabum̐gŏṁḍa yĕttinavānigi
yīdĕsa śhrīveṁkaḍādri yĕkki yāḍam̐dagune