ఉండవయ్య యెఱుఁగుదు నూరకే నీవు
(॥పల్లవి॥)
ఉండవయ్య యెఱుఁగుదు నూరకే నీవు
దుండగవు సేఁతలను దొమ్మిసేసే వారమా
(॥ఉండ॥)
నిన్న నీవు చేసినట్టి నెరజాణ తనములు
కన్నులతుదల మాకుఁ గానవచ్చెను
పన్ని నీ వప్పటి మాతో బాసలేల చేసేవు
కన్నెలము నేము నిన్నుఁ గల్లలెంచే వారమా
(॥ఉండ॥)
వోడక రేపకాడ నీ వుండినట్టి వునుకులు
వేడుకతోఁ జెవులార వింటిమి నేము
జాడతోఁ దారుకాణించవలెనా మాకింతేసి
వూడిగపువారము నిన్నొరసేటి వారమా
(॥ఉండ॥)
ఇప్పుడు నీవు మమ్ము నెనసిన రతులెల్ల
చిప్పుల మనసులోనఁ జేకొంటిమి
ముప్పిరి శ్రీవేంకటేశ ముదులకించ వలెనా
అప్పసము నేము నిన్ను నలయించే వారమా
(||pallavi||)
uṁḍavayya yĕṟum̐gudu nūrage nīvu
duṁḍagavu sem̐talanu dŏmmisese vāramā
(||uṁḍa||)
ninna nīvu sesinaṭṭi nĕrajāṇa tanamulu
kannuladudala māgum̐ gānavachchĕnu
panni nī vappaḍi mādo bāsalela sesevu
kannĕlamu nemu ninnum̐ gallalĕṁche vāramā
(||uṁḍa||)
voḍaga rebagāḍa nī vuṁḍinaṭṭi vunugulu
veḍugadom̐ jĕvulāra viṁṭimi nemu
jāḍadom̐ dārugāṇiṁchavalĕnā māgiṁtesi
vūḍigabuvāramu ninnŏraseḍi vāramā
(||uṁḍa||)
ippuḍu nīvu mammu nĕnasina radulĕlla
sippula manasulonam̐ jegŏṁṭimi
muppiri śhrīveṁkaḍeśha mudulagiṁcha valĕnā
appasamu nemu ninnu nalayiṁche vāramā