Umdavayya saalum jaalu vorayagu mammu nim(nim?)ta

ఉండవయ్య చాలుఁ జాలు వొరయకు మమ్ము నిఁ(నిం?)త
Language

(॥పల్లవి॥)
ఉండవయ్య చాలుఁ జాలు వొరయకు మమ్ము నిఁ(నిం?)త
నిండువావులు చెప్పేది నీ సాజము

(॥॥)
యెక్కడనుండి వచ్చి ఇంతులు పొలసినాను
నిక్కినిక్కి చూచేది నీ సాజము
చక్కనివారిఁ గంటే సరికి బేసికి నీవు
నెక్కొని నవ్వునవ్వేది నీ సాజము

(॥॥)
తేరకే వచ్చినయట్టితెరవలతోడుత
నేరుపుమాట లాడేది నీ సాజము
పోరచి నీ యిరుగుపొరుగుల వారితో
నీరతులు చెప్పేది నీ సాజము

(॥॥)
అచ్చలాన నే పొద్దూ నండనుండి పనిసేసే-
నెచ్చెలులఁ గూడేది నీ సాజము
పచ్చిగా శ్రీ వేంకటేశ పలుమారు మన్నించి
నిచ్చలు మమ్ము నేలేది నీ సాజము

(||pallavi||)
uṁḍavayya sālum̐ jālu vŏrayagu mammu nim̐(niṁ?)ta
niṁḍuvāvulu sĕppedi nī sājamu

(||||)
yĕkkaḍanuṁḍi vachchi iṁtulu pŏlasinānu
nikkinikki sūsedi nī sājamu
sakkanivārim̐ gaṁṭe sarigi besigi nīvu
nĕkkŏni navvunavvedi nī sājamu

(||||)
terage vachchinayaṭṭidĕravaladoḍuda
nerubumāḍa lāḍedi nī sājamu
porasi nī yirugubŏrugula vārido
nīradulu sĕppedi nī sājamu

(||||)
achchalāna ne pŏddū naṁḍanuṁḍi panisese-
nĕchchĕlulam̐ gūḍedi nī sājamu
pachchigā śhrī veṁkaḍeśha palumāru manniṁchi
nichchalu mammu neledi nī sājamu