ఉండవయ్య మమ్మునేల వుడికించేవు
(॥పల్లవి॥)
ఉండవయ్య మమ్మునేల వుడికించేవు
బండుసేసి యాఁటదాని బతిమాలిపింతురా
(॥॥)
అట్టే కాఁగిలియ్యక ఆసలెన్ని వెట్టినాను
నెట్టుకొన్నమతికిఁ దనివి వచ్చీనా
గుట్టున నీవు గూడక గోరనెంత గీరినాను
వట్టి బేఁటమేకాక వచ్చేదేమున్నది
(॥॥)
తనువులు సోఁకక తతి నెత్తమాడితే
వెనకటి విరహపు వేఁడి మానీనా
చనుమొనలు నాఁటక కనుచూపులఁ జూచితే
గొనకొన నెంచుకొన్న కోరిక దీరీనా
(॥॥)
నన్నిట్లాఁ గూడక నవ్వులూరక నవ్వితే
కన్నెపాయపు సిగ్గులు కడతేరీనా
మన్నించి సేసవెట్టక మాటలెన్ని యాడినాను
సన్నల శ్రీవేంకటేశ చవి గానిపించునా
(||pallavi||)
uṁḍavayya mammunela vuḍigiṁchevu
baṁḍusesi yām̐ṭadāni badimālibiṁturā
(||||)
aṭṭe kām̐giliyyaga āsalĕnni vĕṭṭinānu
nĕṭṭugŏnnamadigim̐ danivi vachchīnā
guṭṭuna nīvu gūḍaga goranĕṁta gīrinānu
vaṭṭi bem̐ṭamegāga vachchedemunnadi
(||||)
tanuvulu som̐kaga tadi nĕttamāḍide
vĕnagaḍi virahabu vem̐ḍi mānīnā
sanumŏnalu nām̐ṭaga kanusūbulam̐ jūside
gŏnagŏna nĕṁchugŏnna koriga dīrīnā
(||||)
nanniṭlām̐ gūḍaga navvulūraga navvide
kannĕbāyabu siggulu kaḍaderīnā
manniṁchi sesavĕṭṭaga māḍalĕnni yāḍinānu
sannala śhrīveṁkaḍeśha savi gānibiṁchunā