Umdavayya imka neevu vobbuddidonu

ఉండవయ్య ఇఁక నీవు వొబ్బుద్దితోను
Language

(॥పల్లవి॥)
ఉండవయ్య ఇఁక నీవు వొబ్బుద్దితోను
నిండుకొనె నవ్వులెల్లా నేఁడు నా సెలవుల

(॥॥)
బొంకక చెప్పితివిగా పొందుల నీసుద్దు లెల్లా
కొంకక నామనసులో కోపము మానె
అంకెల నేఁ బెట్టుమన్న ఆన వెట్టుకొంటివిగా
మంకునాచలములెల్లా మట్టుపడీనిపుడు

(॥॥)
తగ నియ్యకొంటివిగా తారుకాణించినవెల్లా
యెగసక్కెములవుడు కెంతయుఁ బాసె
తగవరులు చెప్పితే తల వంచుకొంటివిగా
వెగటులన్నీ నుడిగి వేడుకలాయను

(॥॥)
సిగ్గులువడితివిగా చేఁతలు దలపంచి
వెగ్గళించిన తొల్లిటివెత దీరెను
నిగ్గుల శ్రీ వేంకటేశ నీవు నన్నేలితివిగా
తగ్గనిభోగముల సంతసము లీడేరేను

(||pallavi||)
uṁḍavayya im̐ka nīvu vŏbbuddidonu
niṁḍugŏnĕ navvulĕllā nem̐ḍu nā sĕlavula

(||||)
bŏṁkaga sĕppidivigā pŏṁdula nīsuddu lĕllā
kŏṁkaga nāmanasulo kobamu mānĕ
aṁkĕla nem̐ bĕṭṭumanna āna vĕṭṭugŏṁṭivigā
maṁkunāsalamulĕllā maṭṭubaḍīnibuḍu

(||||)
taga niyyagŏṁṭivigā tārugāṇiṁchinavĕllā
yĕgasakkĕmulavuḍu kĕṁtayum̐ bāsĕ
tagavarulu sĕppide tala vaṁchugŏṁṭivigā
vĕgaḍulannī nuḍigi veḍugalāyanu

(||||)
sigguluvaḍidivigā sem̐talu dalabaṁchi
vĕggaḽiṁchina tŏlliḍivĕda dīrĕnu
niggula śhrī veṁkaḍeśha nīvu nannelidivigā
tagganibhogamula saṁtasamu līḍerenu