Umdarayya vedugado nokkamanasuna meeru

ఉండరయ్య వేడుకతో నొక్కమనసున మీరు
Language

(॥పల్లవి॥)
ఉండరయ్య వేడుకతో నొక్కమనసున మీరు
కొండవంటి చుట్టాలు మీకునుఁ గల రెపుడు

(॥ఉండ॥)
మంతనాన నాపెఁ బెట్టి మాటలు నీకుఁ జెప్పి
ఇంత లేడ తాఁకేరు ఇందు నందును
పంత మాపె కిప్పించి నీ పాదలకు మొక్కించి
సంతోసాలు రేఁచిరి యీ సతులెల్ల మీకును

(॥ఉండ॥)
నీరూపె మాకెకుఁ జూపి నీ వద్ది కాపెనుఁ దెచ్చి
చేరి పొందులు నేసేరు చెలులెల్లాను
సారె నాపెఁ దలఁపంచి సన్న లాపె చేఁ జేయించి
నెరపిరి చేఁతలు యీ నెలఁతలు మీకును

(॥ఉండ॥)
నీతొడపై నాపెఁ బెట్టి ని న్నాపెఁ గాఁగిలింపంచి
నీతితో మిమ్ముఁ గూర్చిరి నీరజాక్షులు
యీ తల శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నేఁడు
యేతుల మిమ్ము మెప్పించిరి సతులెల్లాను

(||pallavi||)
uṁḍarayya veḍugado nŏkkamanasuna mīru
kŏṁḍavaṁṭi suṭṭālu mīgunum̐ gala rĕbuḍu

(||uṁḍa||)
maṁtanāna nābĕm̐ bĕṭṭi māḍalu nīgum̐ jĕppi
iṁta leḍa tām̐keru iṁdu naṁdunu
paṁta mābĕ kippiṁchi nī pādalagu mŏkkiṁchi
saṁtosālu rem̐siri yī sadulĕlla mīgunu

(||uṁḍa||)
nīrūbĕ māgĕgum̐ jūbi nī vaddi kābĕnum̐ dĕchchi
seri pŏṁdulu neseru sĕlulĕllānu
sārĕ nābĕm̐ dalam̐paṁchi sanna lābĕ sem̐ jeyiṁchi
nĕrabiri sem̐talu yī nĕlam̐talu mīgunu

(||uṁḍa||)
nīdŏḍabai nābĕm̐ bĕṭṭi ni nnābĕm̐ gām̐giliṁpaṁchi
nīdido mimmum̐ gūrsiri nīrajākṣhulu
yī tala śhrī veṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
yedula mimmu mĕppiṁchiri sadulĕllānu