ఉండనుండఁ జవులౌను వువిదల వలపులు
(॥పల్లవి॥)
ఉండనుండఁ జవులౌను వువిదల వలపులు
మెండుగ నాపె నీతో మేలమాడీఁ గాని
(॥ఉండ॥)
పలుకకుండఁగ నీతోఁ బంతమా ఆపె కేమి
తలపోఁత పరాకునఁ దగిలున్నది
బలిమికాఁడవు నీవు పట్టి పెనఁగఁగరాదా
మలసి యాపె నీతో మాఁటలాడీఁగాని
(॥ఉండ॥)
యెదురుకొనక నీతో నెమ్మెలా యాపెకేమి
వుదుటు మదమునను వోలలాడీని
చదురుకాఁడవు నీవు చనవులియ్యఁగరాదా
పొదిగి యాపె నీతో భోగించీఁగాని
(॥ఉండ॥)
సేవలు సేయక నీతో సిగ్గులా ఆపెకేమి
నీవిధాలు దెలుసుకో నిలుచున్నది
భావించి శ్రీ వేంకటేశ పడఁతిఁ గూడితి విట్టె
వేవేలుగా నాపై నిన్ను వెలయించీఁగాని
(||pallavi||)
uṁḍanuṁḍam̐ javulaunu vuvidala valabulu
mĕṁḍuga nābĕ nīdo melamāḍīm̐ gāni
(||uṁḍa||)
palugaguṁḍam̐ga nīdom̐ baṁtamā ābĕ kemi
talabom̐ta parāgunam̐ dagilunnadi
balimigām̐ḍavu nīvu paṭṭi pĕnam̐gam̐garādā
malasi yābĕ nīdo mām̐ṭalāḍīm̐gāni
(||uṁḍa||)
yĕdurugŏnaga nīdo nĕmmĕlā yābĕgemi
vuduḍu madamunanu volalāḍīni
sadurugām̐ḍavu nīvu sanavuliyyam̐garādā
pŏdigi yābĕ nīdo bhogiṁchīm̐gāni
(||uṁḍa||)
sevalu seyaga nīdo siggulā ābĕgemi
nīvidhālu dĕlusugo nilusunnadi
bhāviṁchi śhrī veṁkaḍeśha paḍam̐tim̐ gūḍidi viṭṭĕ
vevelugā nābai ninnu vĕlayiṁchīm̐gāni