ఉండనుండఁ దరితీపు లొగరాయఁగా
(॥పల్లవి॥)
ఉండనుండఁ దరితీపు లొగరాయఁగా
పండిన వలపులెల్లాఁ బచ్చియాయఁగా
(॥ఉండ॥)
వాలాయించి మాయింటికే వచ్చేనన్నవాఁడు నేఁడు
లేలే ఆకెయింటి కేఁగె లెస్సాయఁగా
నాలిసేసి నన్ను నింత నమ్మించి యిట్టె తాను
తాలిమిఁ బరాకు సేసిఁ దగవాయఁగా
(॥ఉండ॥)
యీరీతి నేనాడినట్టి యేకతపుముచ్చటలు
మేరతో నాకెకుఁ జెప్ప మెచ్చాయఁగా
పారితెంచి త త్తరానఁ బానువుమీఁదికి వచ్చి
జారువలపులు చల్లీ సంగతాయఁగా
(॥ఉండ॥)
నాకు లోనై యింతలోనే నగుతానే నన్నుఁ గూడి
అకెను నాతోనే తిట్టీ నరుదాయఁగా
పైకొని శ్రీవేంకటాద్రిపతిగాన యీమాయలు
జోకతోఁ దనకే చెల్లు సోద్యమాయఁగా
(||pallavi||)
uṁḍanuṁḍam̐ daridību lŏgarāyam̐gā
paṁḍina valabulĕllām̐ bachchiyāyam̐gā
(||uṁḍa||)
vālāyiṁchi māyiṁṭige vachchenannavām̐ḍu nem̐ḍu
lele āgĕyiṁṭi kem̐gĕ lĕssāyam̐gā
nālisesi nannu niṁta nammiṁchi yiṭṭĕ tānu
tālimim̐ barāgu sesim̐ dagavāyam̐gā
(||uṁḍa||)
yīrīdi nenāḍinaṭṭi yegadabumuchchaḍalu
merado nāgĕgum̐ jĕppa mĕchchāyam̐gā
pāridĕṁchi ta ttarānam̐ bānuvumīm̐digi vachchi
jāruvalabulu sallī saṁgadāyam̐gā
(||uṁḍa||)
nāgu lonai yiṁtalone nagudāne nannum̐ gūḍi
agĕnu nādone tiṭṭī narudāyam̐gā
paigŏni śhrīveṁkaḍādribadigāna yīmāyalu
jogadom̐ danage sĕllu sodyamāyam̐gā