ఉండనిమ్మననే నన్ను వూరకే యీడ
(॥పల్లవి॥)
ఉండనిమ్మననే నన్ను వూరకే యీడ
చండివడీ నేమన్నా చాయల యీగుణము
(॥ఉండ॥)
తనతో నే నవ్వఁబోతే తతిగొనీ సిగ్గులు
చెనకి చేయంటఁబోతేఁ జెమరించీని
మనసునఁ దలఁచితే మర్మములు గరఁగీ
వెనకటిపొందే చాలు వెఱతు నే నిఁకను
(॥ఉండ॥)
దగ్గరి కూచుండఁబోతేఁ దమకించీఁ దనువు
వెగ్గళించి చూడఁబోతే వెరగయ్యీని
నిగ్గుల మాటడఁబోతే నిలువెల్లాఁ బులకించీ
అగ్గమైతిఁ దొల్లె తన కాయనాయ నిఁకను
(॥ఉండ॥)
రతులు మెచ్చఁగఁబోతే రాఁగీఁ బెదవులు
యితవై కాఁగిలించితే నేకమైతిని
సతమై శ్రీ వేంకటాద్రిసరసుఁడు గూడె నన్ను
అతిమోహమున మించినననేల యిఁకను
(||pallavi||)
uṁḍanimmanane nannu vūrage yīḍa
saṁḍivaḍī nemannā sāyala yīguṇamu
(||uṁḍa||)
tanado ne navvam̐bode tadigŏnī siggulu
sĕnagi seyaṁṭam̐bodem̐ jĕmariṁchīni
manasunam̐ dalam̐side marmamulu garam̐gī
vĕnagaḍibŏṁde sālu vĕṟadu ne nim̐kanu
(||uṁḍa||)
daggari kūsuṁḍam̐bodem̐ damagiṁchīm̐ danuvu
vĕggaḽiṁchi sūḍam̐bode vĕragayyīni
niggula māḍaḍam̐bode niluvĕllām̐ bulagiṁchī
aggamaidim̐ dŏllĕ tana kāyanāya nim̐kanu
(||uṁḍa||)
radulu mĕchcham̐gam̐bode rām̐gīm̐ bĕdavulu
yidavai kām̐giliṁchide negamaidini
sadamai śhrī veṁkaḍādrisarasum̐ḍu gūḍĕ nannu
adimohamuna miṁchinananela yim̐kanu