Umdaneeve taanetlanumdinaanu ne nimma

ఉండనీవే తానెట్లనుండినాను నే నిమ్మ
Language

(॥పల్లవి॥)
ఉండనీవే తానెట్లనుండినాను నే నిమ్మ-
పండు గానుకిచ్చితేను పనులెల్లా నౌను

(॥ఉండ॥)
యెఱఁగనిపొందులు యెక్కడోవారికినైన
జఱఁగఁ బొఁ(బొం?) దైతేనే చవివుట్టును
మఱచి ముమ్మదముతో మాఁకువలె నుండినాను
గుఱిగా గోరుసోఁకితే కోరికలు రేఁగును

(॥ఉండ॥)
అగ్గలమై యించుక మోహములేనివారికైన
దగ్గరఁ గూచుండితేనే తమిరేఁగును
సిగ్గువడి తలవంచి చెక్కు చేతిలో నుండిన
వొగ్గి మాటలాడితేనే వొడఁబడు మనసు

(॥ఉండ॥)
అక్కజపువొట్లతో నటిగినవారికైన
చక్కఁజూచి నవ్వితేనే సమ్మతులౌను
యిక్కు వెఱిఁగి శ్రీవేంకటేశుఁడిటు నన్నుఁ గూడె
మొక్కిననా మొక్కులెల్ల ముద్దులై తోఁచును

(||pallavi||)
uṁḍanīve tānĕṭlanuṁḍinānu ne nimma-
paṁḍu gānugichchidenu panulĕllā naunu

(||uṁḍa||)
yĕṟam̐ganibŏṁdulu yĕkkaḍovāriginaina
jaṟam̐gam̐ bŏm̐(bŏṁ?) daidene savivuṭṭunu
maṟasi mummadamudo mām̐kuvalĕ nuṁḍinānu
guṟigā gorusom̐kide korigalu rem̐gunu

(||uṁḍa||)
aggalamai yiṁchuga mohamulenivārigaina
daggaram̐ gūsuṁḍidene tamirem̐gunu
sigguvaḍi talavaṁchi sĕkku sedilo nuṁḍina
vŏggi māḍalāḍidene vŏḍam̐baḍu manasu

(||uṁḍa||)
akkajabuvŏṭlado naḍiginavārigaina
sakkam̐jūsi navvidene sammadulaunu
yikku vĕṟim̐gi śhrīveṁkaḍeśhum̐ḍiḍu nannum̐ gūḍĕ
mŏkkinanā mŏkkulĕlla muddulai tom̐sunu