Umdaneeraa yeebaadi voorage nannu

ఉండనీరా యీపాటి వూరకే నన్ను
Language

(॥పల్లవి॥)
ఉండనీరా యీపాటి వూరకే నన్ను
కొండెగోడి(?)తనాలకుఁ గోపమెల్లా వచ్చును

(॥ఉండ॥)
చుట్టమవౌతా నెరఁగ సూడు బంటవో యెరఁగ
అట్టె నాతో నాపెసుద్దు లాడుకొనేవు
ముట్టి ముట్టి నేము నీతో ముచ్చటలు చెప్పుకొఁగా
యెట్టు వచ్చునో యెరఁగ మేమీ నననొల్లము

(॥ఉండ॥)
నగవౌతా నెరఁగము నాటకమో యెరఁగము
తగవు నన్నడిగే వాతరుణిమాట
నిగిడి పోపో చాలు నిన్ను నెవ్వఁ డెరుఁగును
యెగసక్కీఁడవు తొల్లే యేమీ నననోపము

(॥ఉండ॥)
నెపమౌతా నెరఁగము నెయ్యమౌతా నెరఁగము
ఇపుడు వచ్చితిరి మాయింటికి మీరు
అపడె శ్రీవేంకటేశ అలమేలుమంగ నేను
చపలతఁ గూడితి సాదించ నే నోపను

(||pallavi||)
uṁḍanīrā yībāḍi vūrage nannu
kŏṁḍĕgoḍi(?)tanālagum̐ gobamĕllā vachchunu

(||uṁḍa||)
suṭṭamavaudā nĕram̐ga sūḍu baṁṭavo yĕram̐ga
aṭṭĕ nādo nābĕsuddu lāḍugŏnevu
muṭṭi muṭṭi nemu nīdo muchchaḍalu sĕppugŏm̐gā
yĕṭṭu vachchuno yĕram̐ga memī nananŏllamu

(||uṁḍa||)
nagavaudā nĕram̐gamu nāḍagamo yĕram̐gamu
tagavu nannaḍige vādaruṇimāḍa
nigiḍi pobo sālu ninnu nĕvvam̐ ḍĕrum̐gunu
yĕgasakkīm̐ḍavu tŏlle yemī nananobamu

(||uṁḍa||)
nĕbamaudā nĕram̐gamu nĕyyamaudā nĕram̐gamu
ibuḍu vachchidiri māyiṁṭigi mīru
abaḍĕ śhrīveṁkaḍeśha alamelumaṁga nenu
sabaladam̐ gūḍidi sādiṁcha ne nobanu