Ullamulo talabomta nolalaadusunnadaana

ఉల్లములో తలపోఁత నోలలాడుచున్నదాన
Language

(॥పల్లవి॥)
ఉల్లములో తలపోఁత నోలలాడుచున్నదాన
వెల్లవిరిగాఁ జెప్పవే వేడుకయ్యీఁ జెలియా

(॥ఉల్ల॥)
వచ్చునొకో ఆతఁడు నా వాకిటికి నెప్పుడైనా
మెచ్చునొకో నాతోను మేలము లాడి
యిచ్చునొకో చనవు నా కిందరిలో నా నేఁడు
హెచ్చెఁ గోరికలు నాలో నేముందునే చెలియా

(॥ఉల్ల॥)
కందునొకో యాతనిఁ గన్నులయెదుట నేను
విందునొకో మాఁటలు వీనులారను
పొందునోకో నాకాఁగిట బుజ్జగించి ఇట్టె తాను
సందడించీఁ దమకమెంచఁగరాదే చెలియా

(॥ఉల్ల॥)
యెక్కునొకొ నా సేవ లిన్నియును నాతనికి
చొక్కునొకొ నా రతుల సులభానను
దక్కునొకొ యనఁగానే తానె శ్రీవేంకటేశుఁడు
ఇక్కడికె విచ్చేసి యేలె నన్నుఁ జెలియా

(||pallavi||)
ullamulo talabom̐ta nolalāḍusunnadāna
vĕllavirigām̐ jĕppave veḍugayyīm̐ jĕliyā

(||ulla||)
vachchunŏgo ādam̐ḍu nā vāgiḍigi nĕppuḍainā
mĕchchunŏgo nādonu melamu lāḍi
yichchunŏgo sanavu nā kiṁdarilo nā nem̐ḍu
hĕchchĕm̐ gorigalu nālo nemuṁdune sĕliyā

(||ulla||)
kaṁdunŏgo yādanim̐ gannulayĕduḍa nenu
viṁdunŏgo mām̐ṭalu vīnulāranu
pŏṁdunogo nāgām̐giḍa bujjagiṁchi iṭṭĕ tānu
saṁdaḍiṁchīm̐ damagamĕṁcham̐garāde sĕliyā

(||ulla||)
yĕkkunŏgŏ nā seva linniyunu nādanigi
sŏkkunŏgŏ nā radula sulabhānanu
dakkunŏgŏ yanam̐gāne tānĕ śhrīveṁkaḍeśhum̐ḍu
ikkaḍigĕ vichchesi yelĕ nannum̐ jĕliyā