Ullamu galayudaamkaa vooragumdude melu

ఉల్లము గలయుదాఁకా వూరకుండుటే మేలు
Language

(॥పల్లవి॥)
ఉల్లము గలయుదాఁకా వూరకుండుటే మేలు
మల్లాడి తా వలెనంటే మైకొనే నపుడు

(॥ఉల్ల॥)
మనసు నిర్మలమైతే మాట విన నింపౌను
ననువు గలవారికి నవ్వ నింపౌను
చనవు గలిగితేను సాదించ నింపౌను
యెనయనిచోటికి నేమిటికి మాటలు

(॥ఉల్ల॥)
తలయెత్తి చూచితేను దండకు రా నింపౌను
చెలిమి సేసితే విందు చెప్పి నింపౌను
పిలువు గలిగితేను పెనఁగఁగ నింపౌను
వొలిసి నొల్లమికిని వొడి వట్ట నేఁటికే

(॥ఉల్ల॥)
కరఁగి లోనై తేను కాఁగిలించ నింపౌను
సరస మాడితే చెయి చాఁచ నింపౌను
యిరవై శ్రీవేంకటేశుఁ డితఁ డిట్టె నన్నుఁగూడె
తరితీపైనందుకు తామసించ నేఁటికే

(||pallavi||)
ullamu galayudām̐kā vūraguṁḍuḍe melu
mallāḍi tā valĕnaṁṭe maigŏne nabuḍu

(||ulla||)
manasu nirmalamaide māḍa vina niṁpaunu
nanuvu galavārigi navva niṁpaunu
sanavu galigidenu sādiṁcha niṁpaunu
yĕnayanisoḍigi nemiḍigi māḍalu

(||ulla||)
talayĕtti sūsidenu daṁḍagu rā niṁpaunu
sĕlimi seside viṁdu sĕppi niṁpaunu
piluvu galigidenu pĕnam̐gam̐ga niṁpaunu
vŏlisi nŏllamigini vŏḍi vaṭṭa nem̐ṭige

(||ulla||)
karam̐gi lonai tenu kām̐giliṁcha niṁpaunu
sarasa māḍide sĕyi sām̐sa niṁpaunu
yiravai śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ ḍiṭṭĕ nannum̐gūḍĕ
taridībainaṁdugu tāmasiṁcha nem̐ṭige