Udivoni valabulado nummagiludaa nunnadi

ఉడివోని వలపులతో నుమ్మగిలుతా నున్నది
Language

(॥పల్లవి॥)
ఉడివోని వలపులతో నుమ్మగిలుతా నున్నది
కడలేని వేడుకతోఁ గాఁగిలించవయ్యా

(॥ఉడి॥)
సేసకొప్పు వెడజారీ చెక్కుల చెమట గారీ
ఆసతోడ మోవితేనె లట్టె వూరీని
పాసివున్నతమకము పడఁతికి దైలువారీ
గాసిఁబెట్ట కింతటను కరుణించవయ్యా

(॥ఉడి॥)
చెక్కిటిపై జేయి మించీ శిర సూర కెల వంచీ
కిక్కిరిసి మతిఁ గోరికెలు ముంచీని
అక్కరతోడ సారెసారె నంగన మెయి పులకించీ
కక్కసపెట్టక యిఁకఁ గరుణించవయ్యా

(॥ఉడి॥)
నిలువుఁగళలు నిక్కీ నీసుద్దులు విని చొక్కీ
నిలిచి చీయెదుటను నీకు మొక్కీని
నెలవై శ్రీవేంకటేశ యలమేలుమంగయీకె
కలసితి విట్లానే కరుణించవయ్యా

(||pallavi||)
uḍivoni valabulado nummagiludā nunnadi
kaḍaleni veḍugadom̐ gām̐giliṁchavayyā

(||uḍi||)
sesagŏppu vĕḍajārī sĕkkula sĕmaḍa gārī
āsadoḍa movidenĕ laṭṭĕ vūrīni
pāsivunnadamagamu paḍam̐tigi dailuvārī
gāsim̐bĕṭṭa kiṁtaḍanu karuṇiṁchavayyā

(||uḍi||)
sĕkkiḍibai jeyi miṁchī śhira sūra kĕla vaṁchī
kikkirisi madim̐ gorigĕlu muṁchīni
akkaradoḍa sārĕsārĕ naṁgana mĕyi pulagiṁchī
kakkasabĕṭṭaga yim̐kam̐ garuṇiṁchavayyā

(||uḍi||)
niluvum̐gaḽalu nikkī nīsuddulu vini sŏkkī
nilisi sīyĕduḍanu nīgu mŏkkīni
nĕlavai śhrīveṁkaḍeśha yalamelumaṁgayīgĕ
kalasidi viṭlāne karuṇiṁchavayyā