Uddamdamu nayamunu vonari neeyamdunnavi

ఉద్దండము నయమును వొనరి నీయందున్నవి
Language

(॥పల్లవి॥)
ఉద్దండము నయమును వొనరి నీయందున్నవి
సుద్దులేల చెప్ప నీవే చూచుకొనరాదా

(॥ఉద్దం॥)
పొంచిపొంచి యాతనిని బొమ్మల జంకించనేల
మంచితనము చూపి మాటాడరాదా
ఇంచుకించుక సొలసి యెలయించ నింతయేల
కంచపుమోవి చూపి కరఁగించరాదా

(॥ఉద్దం॥)
కన్నులఁ దప్పకచూచి ఘాతలు సేయఁగనేల
నున్ననిచేతులఁ జెక్కు నొక్కఁగరాదా
చన్నుమొనలు దాఁకించి సాదించ నిదియేల
చిన్ని సెలువుల నవ్వి చిక్కించుకోరాదా

(॥ఉద్దం॥)
పంతనుఁజేఁతల నిట్టె పట్టి పెనఁగఁగనేల
చెంతల నిరతిఁ గూడి చెనకరాదా
అంతటి శ్రీవేంకటేశునలమేల్ మంగపు నీవు
వింతగా నన్నితఁ డేలె వేగమె మెచ్చరాదా

(||pallavi||)
uddaṁḍamu nayamunu vŏnari nīyaṁdunnavi
suddulela sĕppa nīve sūsugŏnarādā

(||uddaṁ||)
pŏṁchibŏṁchi yādanini bŏmmala jaṁkiṁchanela
maṁchidanamu sūbi māḍāḍarādā
iṁchugiṁchuga sŏlasi yĕlayiṁcha niṁtayela
kaṁchabumovi sūbi karam̐giṁcharādā

(||uddaṁ||)
kannulam̐ dappagasūsi ghādalu seyam̐ganela
nunnanisedulam̐ jĕkku nŏkkam̐garādā
sannumŏnalu dām̐kiṁchi sādiṁcha nidiyela
sinni sĕluvula navvi sikkiṁchugorādā

(||uddaṁ||)
paṁtanum̐jem̐tala niṭṭĕ paṭṭi pĕnam̐gam̐ganela
sĕṁtala niradim̐ gūḍi sĕnagarādā
aṁtaḍi śhrīveṁkaḍeśhunalamel maṁgabu nīvu
viṁtagā nannidam̐ ḍelĕ vegamĕ mĕchcharādā