ఉద్దగిరికృష్ణుఁ డాతఁ డొక్కఁడే జాణఁడంటివి
(॥పల్లవి॥)
ఉద్దగిరికృష్ణుఁ డాతఁ డొక్కఁడే జాణఁడంటివి
పొద్దున మాకిద్దరికిఁ బొసఁగునే చెలియా
(॥ఉద్ద॥)
వెలఁ దాతనిగుణాలు వేగినఁతాఁజెప్పితివి
వెలయ నెందున్నాఁడే వెలఁది వాఁడు
కలఁ దాతఁ డందరికంటెఁ జక్కనివాఁ డంటి-
వలరఁ దోడితేవే నాయఁడకు నేఁడు
(॥ఉద్ద॥)
పొది గాతనినేర్పులు పొగడితి విందాఁకా
సుదతి మొక్కే విట్టె చూపవే నాకు
చదురుఁదనము రాజసము గలవాఁడంటివి
యెదిటికిఁ దానెప్పుడెపుడ వచ్చీనే
(॥ఉద్ద॥)
వడి నాతనికి నాకు వలపు వుట్టించితివి
కడఁగి నాతోఁ జుట్టరికము సేయవే
యెడయక శ్రీవేంకటేశుఁడే తానట నన్నుఁ
దడవి యేనినాఁడౌనె తప్పదు నీమాట
(||pallavi||)
uddagirikṛṣhṇum̐ ḍādam̐ ḍŏkkam̐ḍe jāṇam̐ḍaṁṭivi
pŏdduna māgiddarigim̐ bŏsam̐gune sĕliyā
(||udda||)
vĕlam̐ dādaniguṇālu veginam̐tām̐jĕppidivi
vĕlaya nĕṁdunnām̐ḍe vĕlam̐di vām̐ḍu
kalam̐ dādam̐ ḍaṁdarigaṁṭĕm̐ jakkanivām̐ ḍaṁṭi-
valaram̐ doḍideve nāyam̐ḍagu nem̐ḍu
(||udda||)
pŏdi gādaninerbulu pŏgaḍidi viṁdām̐kā
sudadi mŏkke viṭṭĕ sūbave nāgu
sadurum̐danamu rājasamu galavām̐ḍaṁṭivi
yĕdiḍigim̐ dānĕppuḍĕbuḍa vachchīne
(||udda||)
vaḍi nādanigi nāgu valabu vuṭṭiṁchidivi
kaḍam̐gi nādom̐ juṭṭarigamu seyave
yĕḍayaga śhrīveṁkaḍeśhum̐ḍe tānaḍa nannum̐
daḍavi yeninām̐ḍaunĕ tappadu nīmāḍa