ఉద్దగిరి కృష్ణుఁడు వుబ్బరికాఁడు వీఁడు
(॥పల్లవి॥)
ఉద్దగిరి కృష్ణుఁడు వుబ్బరికాఁడు వీఁడు
ముద్దులు చూపుతానే ముసుఁగులు దీసేనే
(॥॥)
చెంగట నిద్దిరించేటిచెలువంపు గొల్లెతల
దొంగిడుచు వచ్చి వచ్చి తొడ లంటీనే
ముంగిటఁ గూచుండఁగాను ముడిచినపోఁకముడి-
కొంగులు విడిచి యట్టె కొల్లున నవ్వీనే
(॥॥)
వేడుకతో గొల్లెతలు వెన్నముద్దలు సేయఁగ
చాడెసంది వచ్చి తాను చన్నులంటీనే
జోడై యెకరొకరు సుద్దులుచెప్పేటివేళ
కోడెకాఁడై యండనుండి కొప్పులు వట్టీనే
(॥॥)
అట్టె విడేలు సేయుచు నాకులు మడుచుకోఁగా
గట్టిగాఁ గళలురేఁగ కాఁగిలించీనే
యిట్టె మమ్మిందరిని యేలి శ్రీవేంకటేశుఁడై
దిట్టతనమున మోవితేనే లిచ్చీనే
(||pallavi||)
uddagiri kṛṣhṇum̐ḍu vubbarigām̐ḍu vīm̐ḍu
muddulu sūbudāne musum̐gulu dīsene
(||||)
sĕṁgaḍa niddiriṁcheḍisĕluvaṁpu gŏllĕdala
dŏṁgiḍusu vachchi vachchi tŏḍa laṁṭīne
muṁgiḍam̐ gūsuṁḍam̐gānu muḍisinabom̐kamuḍi-
kŏṁgulu viḍisi yaṭṭĕ kŏlluna navvīne
(||||)
veḍugado gŏllĕdalu vĕnnamuddalu seyam̐ga
sāḍĕsaṁdi vachchi tānu sannulaṁṭīne
joḍai yĕgarŏgaru suddulusĕppeḍiveḽa
koḍĕgām̐ḍai yaṁḍanuṁḍi kŏppulu vaṭṭīne
(||||)
aṭṭĕ viḍelu seyusu nāgulu maḍusugom̐gā
gaṭṭigām̐ gaḽalurem̐ga kām̐giliṁchīne
yiṭṭĕ mammiṁdarini yeli śhrīveṁkaḍeśhum̐ḍai
diṭṭadanamuna movidene lichchīne