(॥పల్లవి॥)
ఉపచరించవయ్యా వువిదలను
వుపమలతోడనే వొడలు మోపీని
(॥ఉప॥)
జలజలఁ జెమటలు చన్నుల తుదలఁ గార
అలసి గందము వూసీ నతివ నీకు
మలకల నెరివేణి మఱి వీఁపునఁ బొలయ
తలపోఁత గతులఁ బాదములో త్తీని
(॥ఉప॥)
వెడవెడ నిట్టూర్పులు విసర ముక్కునవెంట
జడిసి సురటి వీచీ సారెకు నేఁడు
తొడిఁబడఁ జెమటలు తొటతొటఁ బైఁ బడఁగ
జడిగొన మాటల సరసమాడీని
(॥ఉప॥)
కలసి వొండొంటితో కంకణా లొరయఁగాను
చెలఁగి కాఁగిటఁగూడీ శ్రీవేంకటేశా
కులికి కులికి కొనగోరి గురులు సోఁకఁగ
పలురతుల చవులు పచారించీని
(||pallavi||)
ubasariṁchavayyā vuvidalanu
vubamaladoḍane vŏḍalu mobīni
(||uba||)
jalajalam̐ jĕmaḍalu sannula tudalam̐ gāra
alasi gaṁdamu vūsī nadiva nīgu
malagala nĕriveṇi maṟi vīm̐punam̐ bŏlaya
talabom̐ta gadulam̐ bādamulo ttīni
(||uba||)
vĕḍavĕḍa niṭṭūrbulu visara mukkunavĕṁṭa
jaḍisi suraḍi vīsī sārĕgu nem̐ḍu
tŏḍim̐baḍam̐ jĕmaḍalu tŏḍadŏḍam̐ baim̐ baḍam̐ga
jaḍigŏna māḍala sarasamāḍīni
(||uba||)
kalasi vŏṁḍŏṁṭido kaṁkaṇā lŏrayam̐gānu
sĕlam̐gi kām̐giḍam̐gūḍī śhrīveṁkaḍeśhā
kuligi kuligi kŏnagori gurulu som̐kam̐ga
paluradula savulu pasāriṁchīni