Tudusugomtem bodu todari neevem(vem?)tainaa

తుడుచుకొంటేఁ బోదు తొడరి నీవెఁ(వెం?)తైనా
Language

(॥పల్లవి॥)
తుడుచుకొంటేఁ బోదు తొడరి నీవెఁ(వెం?)తైనా
వడియించీ మొక్కులనే వలపు నీమీఁద

(॥తుడు॥)
నిక్కిచూచి చెలి నీపై నిండా నవ్వులు నవ్వి
చిక్కనివెన్నెలతేట చిందీనదె
చెక్కులను కొనగోళ్లఁ జెనకి కాంతుల మించి
లక్కరసములు చల్లీ లావుగా నీమీఁద

(॥తుడు॥)
వొరసి వొరసి నీతో వూరఁగలమాట లాడి
సిరులగమ్మఁదేనెలు చిందీనదె
సరిగా సేవలు సేసి చన్నుల మెఱుఁగులను
సరుగ బంగారుపొడి చల్లీ నీమీఁద

(॥తుడు॥)
బలిమిఁ గాఁగిటఁ బట్టి భావములనే కరఁగి
చెలఁగి వయోమదము చిందీనదె
యెలమి శ్రీవేంకటేశ ఇంతి నిన్నిటాఁ గూడి
చలములఁ గూరిములు చల్లీ నీమీఁద

(||pallavi||)
tuḍusugŏṁṭem̐ bodu tŏḍari nīvĕm̐(vĕṁ?)tainā
vaḍiyiṁchī mŏkkulane valabu nīmīm̐da

(||tuḍu||)
nikkisūsi sĕli nībai niṁḍā navvulu navvi
sikkanivĕnnĕladeḍa siṁdīnadĕ
sĕkkulanu kŏnagoḽlam̐ jĕnagi kāṁtula miṁchi
lakkarasamulu sallī lāvugā nīmīm̐da

(||tuḍu||)
vŏrasi vŏrasi nīdo vūram̐galamāḍa lāḍi
sirulagammam̐denĕlu siṁdīnadĕ
sarigā sevalu sesi sannula mĕṟum̐gulanu
saruga baṁgārubŏḍi sallī nīmīm̐da

(||tuḍu||)
balimim̐ gām̐giḍam̐ baṭṭi bhāvamulane karam̐gi
sĕlam̐gi vayomadamu siṁdīnadĕ
yĕlami śhrīveṁkaḍeśha iṁti ninniḍām̐ gūḍi
salamulam̐ gūrimulu sallī nīmīm̐da