తుదను దాఁచఁగ రాదు తోడ దిష్టమై వుండఁగ
(॥పల్లవి॥)
తుదను దాఁచఁగ రాదు తోడ దిష్టమై వుండఁగ
మది మది యి ట్లైతి మగఁ డూర లేఁడూ
(॥తుదను॥)
యిందరితో నీ మాఁట యే మని చెప్పుదు నమ్మ
చెంది యీక్రిష్ణుఁడు చీర చిక్కించెను
అందము సేసుక నేను అణఁచుక వుండే నంటే
మంద నున్నాఁ డిదె నామగఁ డూర లేఁడూ
(॥తుదమ॥)
మంచిన మాయింటివారి మొగ మెట్టు చూతు నమ్మ
పెంచిన క్రిష్ణునికిఁ గా బిడ్డఁ గంటివి
పొంచి లోనఁ బెట్టుకొంటే పొరుగిరుగుల నింద
మంచి దాయ బొంకే నంటే మగఁ డూర లేఁడూ
(॥తుదము॥)
వెనక చుట్టాలతోడ వియ్య మెట్టందుదు నమ్మ
యెనసి శ్రీవెంకటేశుఁడింట నున్నాఁడు
పనివడి నేఁడు వచ్చి భ్రమసి చూచీ నదె
మనికై యీన్నాళ్లదాఁక మగఁ డూర లేఁడూ
(||pallavi||)
tudanu dām̐sam̐ga rādu toḍa diṣhṭamai vuṁḍam̐ga
madi madi yi ṭlaidi magam̐ ḍūra lem̐ḍū
(||tudanu||)
yiṁdarido nī mām̐ṭa ye mani sĕppudu namma
sĕṁdi yīkriṣhṇum̐ḍu sīra sikkiṁchĕnu
aṁdamu sesuga nenu aṇam̐suga vuṁḍe naṁṭe
maṁda nunnām̐ ḍidĕ nāmagam̐ ḍūra lem̐ḍū
(||tudama||)
maṁchina māyiṁṭivāri mŏga mĕṭṭu sūdu namma
pĕṁchina kriṣhṇunigim̐ gā biḍḍam̐ gaṁṭivi
pŏṁchi lonam̐ bĕṭṭugŏṁṭe pŏrugirugula niṁda
maṁchi dāya bŏṁke naṁṭe magam̐ ḍūra lem̐ḍū
(||tudamu||)
vĕnaga suṭṭāladoḍa viyya mĕṭṭaṁdudu namma
yĕnasi śhrīvĕṁkaḍeśhum̐ḍiṁṭa nunnām̐ḍu
panivaḍi nem̐ḍu vachchi bhramasi sūsī nadĕ
manigai yīnnāḽladām̐ka magam̐ ḍūra lem̐ḍū