త్రివిక్రమమూర్తియైన దేవునివలె నున్నాఁడు
(॥పల్లవి॥)
త్రివిక్రమమూర్తియైన దేవునివలె నున్నాఁడు
భువి సేవించేవారి పాలి పుణ్యఫల మీతఁడు
(॥త్రివి॥)
అంచె నుదయాస్త గిరులందు నొక జంగ చాఁచి
వంచించక మిన్ను దాఁక వాలమెత్తి
ముంచి బ్రహ్మలోకము మోవఁగఁ బ్రతాపమున
పెంచినాఁడు తనమేను పెద్దహనుమంతుఁడు
(॥త్రివి॥)
తిరముగ హసత్తములు దిక్కులు నిండఁ బరపి
వరుసఁ గర్ణము లిరువంకఁ జిక్కించి
దుర దుర మస్తకము ధ్రువమండలము సోఁక
పెరిగినాఁ డిదివో పెద్దహనుమంతుఁడు
(॥త్రివి॥)
అక్కజపు రోమము లన్నిలోకము లొరయ
మొక్కుచు శ్రీవేంకటేశుమోహపు బంటై
పక్కన నజాండ కప్పరము నిండాఁదాను
పిక్కిటిల్లినాఁ డిదివో పెద్దహనుమంతుఁడు
(||pallavi||)
trivikramamūrdiyaina devunivalĕ nunnām̐ḍu
bhuvi seviṁchevāri pāli puṇyaphala mīdam̐ḍu
(||trivi||)
aṁchĕ nudayāsta girulaṁdu nŏga jaṁga sām̐si
vaṁchiṁchaga minnu dām̐ka vālamĕtti
muṁchi brahmalogamu movam̐gam̐ bradābamuna
pĕṁchinām̐ḍu tanamenu pĕddahanumaṁtum̐ḍu
(||trivi||)
tiramuga hasattamulu dikkulu niṁḍam̐ barabi
varusam̐ garṇamu liruvaṁkam̐ jikkiṁchi
dura dura mastagamu dhruvamaṁḍalamu som̐ka
pĕriginām̐ ḍidivo pĕddahanumaṁtum̐ḍu
(||trivi||)
akkajabu romamu lannilogamu lŏraya
mŏkkusu śhrīveṁkaḍeśhumohabu baṁṭai
pakkana najāṁḍa kapparamu niṁḍām̐dānu
pikkiḍillinām̐ ḍidivo pĕddahanumaṁtum̐ḍu