తొయ్యలులఁ గాకుసేయ దోసము గాదా
(॥పల్లవి॥)
తొయ్యలులఁ గాకుసేయ దోసము గాదా
చయ్యాట మింతేశైతే చనవిత్తురా
(॥తొయ్య॥)
ఆసపడి నిన్ను నాపె అంగ మంటినంతలోనె
వేసాలకే నవ్వేవు వేగినంతాను
గాసిలి నీ వింతేసి యగడుసేసేవాఁడ వైతే
బేసబెల్లితనమునఁ బిలిపింతురా
(॥తొయ్య॥)
యిచ్చల నీయింటి కాపె యిట్టె వచ్చినంతలోనె
మచ్చాలు మేన నించేవు మాపుదాఁకాను
కెచ్చురేఁగి నీ కింత కేరడము లై తేను
పొచ్చముగఁ దొలుతనె పొందు సేతురా
(॥తొయ్య॥)
కెగలి యాపె నిన్నుఁగాఁగిటఁ గూడినంతలోనె
సరసమాడేవు కొప్పు జారుదాఁకాను
యిరవై శ్రీ వేంకటేశ యింతలో నీపెఁ గూడితి
మరిగితే నాసుద్దులు మందలింతురా
(||pallavi||)
tŏyyalulam̐ gāguseya dosamu gādā
sayyāḍa miṁteśhaide sanavitturā
(||tŏyya||)
āsabaḍi ninnu nābĕ aṁga maṁṭinaṁtalonĕ
vesālage navvevu veginaṁtānu
gāsili nī viṁtesi yagaḍusesevām̐ḍa vaide
besabĕllidanamunam̐ bilibiṁturā
(||tŏyya||)
yichchala nīyiṁṭi kābĕ yiṭṭĕ vachchinaṁtalonĕ
machchālu mena niṁchevu mābudām̐kānu
kĕchchurem̐gi nī kiṁta keraḍamu lai tenu
pŏchchamugam̐ dŏludanĕ pŏṁdu sedurā
(||tŏyya||)
kĕgali yābĕ ninnum̐gām̐giḍam̐ gūḍinaṁtalonĕ
sarasamāḍevu kŏppu jārudām̐kānu
yiravai śhrī veṁkaḍeśha yiṁtalo nībĕm̐ gūḍidi
marigide nāsuddulu maṁdaliṁturā