(॥పల్లవి॥)
తొయ్యలివల్ల నింక దోసమేది
చయ్యాటాలు సేయఁగాను చలపట్టెను
(॥॥)
వొలిసి నొల్లని మాటలొకటొక టాడఁగాను
జలజలఁ జెమరించె సతిమేను
పిలువఁగానే నీవు బిగిసి వూరకుండగా
కెలసి కనుఁగొనల కెంపు లెక్కెను
(॥॥)
యేడో సతులఁ జూపి యెగసక్కేల నవ్వఁగా
వాడె నిట్టే మోమెల్ల వనితకును
పాడిదప్పినటువంటి పనులు నీవు సేయఁగ
గాడఁబొలిది తలఁపులఁ గాఁక రేఁగెను
(॥॥)
గోరికొనలటు సోఁక గుంపించి వొడికట్టఁగా
నారుకొనెఁ బులకలున్నతి జెలికి
కూరిమి శ్రీవేంకటేశ గొబ్బున నీకెఁ గూడఁగ
సారె సారె మోవితేనె చవులబ్బెను
(||pallavi||)
tŏyyalivalla niṁka dosamedi
sayyāḍālu seyam̐gānu salabaṭṭĕnu
(||||)
vŏlisi nŏllani māḍalŏgaḍŏga ṭāḍam̐gānu
jalajalam̐ jĕmariṁchĕ sadimenu
piluvam̐gāne nīvu bigisi vūraguṁḍagā
kĕlasi kanum̐gŏnala kĕṁpu lĕkkĕnu
(||||)
yeḍo sadulam̐ jūbi yĕgasakkela navvam̐gā
vāḍĕ niṭṭe momĕlla vanidagunu
pāḍidappinaḍuvaṁṭi panulu nīvu seyam̐ga
gāḍam̐bŏlidi talam̐pulam̐ gām̐ka rem̐gĕnu
(||||)
gorigŏnalaḍu som̐ka guṁpiṁchi vŏḍigaṭṭam̐gā
nārugŏnĕm̐ bulagalunnadi jĕligi
kūrimi śhrīveṁkaḍeśha gŏbbuna nīgĕm̐ gūḍam̐ga
sārĕ sārĕ movidenĕ savulabbĕnu