Toyyalim joosinamtane dosamu gaadu

తొయ్యలిఁ జూచినంతనే దోసము గాదు
Language

(॥పల్లవి॥)
తొయ్యలిఁ జూచినంతనే దోసము గాదు
వొయ్యన యిన్నయుఁ దన్ను వొప్పునఁ గొను మనవే

(॥తొయ్యలి॥)
చెలియ చిత్తములోన జింతాలతలు వెంచె
కలువలు కన్నీళ్ళఁ గడుఁ బెంచెను
వెలలేని కాఁకలను వేఁగి మాఁకులు వేంచె
చల మేల పతి నింతి జక్క జూడుమనవే

(॥తొయ్యలి॥)
కందువ చెక్కిటిచేత కడు దామెరలు వెంచె
గందపుమాకులు వూర్పుగాలిచేఁ బెంచె
చిందేటిసిగ్గుల మంచి సేమంతిపొదలు వెంచె
విందువలెఁ బతి నిందు విచ్చేయు మనవే

(॥తొయ్యలి॥)
అంగన తన్నుఁ బాడి అశోకవనము వెంచె
ముంగిటిముద్దుల మంచి మోపులు వెంచె
యింగితాన శ్రీవేంకటేశుఁ డిటు విచ్చేసి
అంగనఁ గూడెను యిదె అలవాటు సేయరే

(||pallavi||)
tŏyyalim̐ jūsinaṁtane dosamu gādu
vŏyyana yinnayum̐ dannu vŏppunam̐ gŏnu manave

(||tŏyyali||)
sĕliya sittamulona jiṁtāladalu vĕṁchĕ
kaluvalu kannīḽḽam̐ gaḍum̐ bĕṁchĕnu
vĕlaleni kām̐kalanu vem̐gi mām̐kulu veṁchĕ
sala mela padi niṁti jakka jūḍumanave

(||tŏyyali||)
kaṁduva sĕkkiḍiseda kaḍu dāmĕralu vĕṁchĕ
gaṁdabumāgulu vūrbugālisem̐ bĕṁchĕ
siṁdeḍisiggula maṁchi semaṁtibŏdalu vĕṁchĕ
viṁduvalĕm̐ badi niṁdu vichcheyu manave

(||tŏyyali||)
aṁgana tannum̐ bāḍi aśhogavanamu vĕṁchĕ
muṁgiḍimuddula maṁchi mobulu vĕṁchĕ
yiṁgidāna śhrīveṁkaḍeśhum̐ ḍiḍu vichchesi
aṁganam̐ gūḍĕnu yidĕ alavāḍu seyare