Toyyaligim badigini dosamu le detlumdinaa

తొయ్యలికిఁ బతికిని దోసము లే దెట్లుండినా
Language

(॥పల్లవి॥)
తొయ్యలికిఁ బతికిని దోసము లే దెట్లుండినా
చయ్యాటాలు వద్దు గాని సరసము మంచిదే

(॥తొయ్యలి॥)
చలములు వద్దు గాని సతి రమణుతోడ
నెలఁగి యంతేసి సొలసిన మంచిదే
కలఁగి కోపించవద్దు గాని మొగము చూచి
చలివాయ బొమలను జంకించినా మంచిదే

(॥తొయ్యలి॥)
జాలిఁబెట్టవద్దు గాని సరిగెతో నాయకుని
కేల నంది యెంత పెనఁగిన మంచిదే
వోలవేసి మాటాడక వూరకుండవద్దు గాని
పేలరియై యంత వొట్టువెట్టినాను మంచిదే

(॥తొయ్యలి॥)
గబ్బితనమే వద్దు గాని శ్రీవేంకటేశుఁడు
గొబ్బునఁ జెఱఁగు పట్టుకొన్నాను మంచిదే
అబ్బురానఁ గూడితివి యలమేల్మంగవు నీవు
సిబ్బితే వద్దు గాని చెలఁగినా మంచిదే

(||pallavi||)
tŏyyaligim̐ badigini dosamu le dĕṭluṁḍinā
sayyāḍālu vaddu gāni sarasamu maṁchide

(||tŏyyali||)
salamulu vaddu gāni sadi ramaṇudoḍa
nĕlam̐gi yaṁtesi sŏlasina maṁchide
kalam̐gi kobiṁchavaddu gāni mŏgamu sūsi
salivāya bŏmalanu jaṁkiṁchinā maṁchide

(||tŏyyali||)
jālim̐bĕṭṭavaddu gāni sarigĕdo nāyaguni
kela naṁdi yĕṁta pĕnam̐gina maṁchide
volavesi māḍāḍaga vūraguṁḍavaddu gāni
pelariyai yaṁta vŏṭṭuvĕṭṭinānu maṁchide

(||tŏyyali||)
gabbidaname vaddu gāni śhrīveṁkaḍeśhum̐ḍu
gŏbbunam̐ jĕṟam̐gu paṭṭugŏnnānu maṁchide
abburānam̐ gūḍidivi yalamelmaṁgavu nīvu
sibbide vaddu gāni sĕlam̐ginā maṁchide