తొయ్యలి వెంగెములాడ దోసము సుమ్మీ
(॥పల్లవి॥)
తొయ్యలి వెంగెములాడ దోసము సుమ్మీ
చయ్యన నీతో నింత చాలదా యేమీ
(॥తొయ్య॥)
యిద్దరిలో నీకు మోహ మిచ్చితిఁజుమ్మీ అవురా
కద్దు కద్దు నీమాఁట కల్లలా యేమీ
పెద్దగా నీపై నానవెట్టేఁజుమ్మీ అంత
వద్దూవద్దు నీ వట్టివాఁడవా యేమీ
(॥తొయ్య॥)
అఱడిఁ గానుక నీకే యంపితిఁజుమ్మీ
మీఱి యెంతసేసేది మేలుదా యేమి
జాఱిననీపై వలపు చల్లితిఁజుమ్మీ నీకుఁ
బాఱిపాఱి నాతోనె పంతమా యేమీ
(॥తొయ్య॥)
మించిన శ్రీవేంకటాద్రిమేఁటి నేఁ జుమ్మీ యింత-
వంచనతో నాకుఁ జెప్పవలెనా యేమి
అంచెలఁ గూడితి నన్ను నప్పుడేసుమ్మీ యివె
పొంచిపొంచి చెప్పేవు పొద్దువోదా యేమి
(||pallavi||)
tŏyyali vĕṁgĕmulāḍa dosamu summī
sayyana nīdo niṁta sāladā yemī
(||tŏyya||)
yiddarilo nīgu moha michchidim̐jummī avurā
kaddu kaddu nīmām̐ṭa kallalā yemī
pĕddagā nībai nānavĕṭṭem̐jummī aṁta
vaddūvaddu nī vaṭṭivām̐ḍavā yemī
(||tŏyya||)
aṟaḍim̐ gānuga nīge yaṁpidim̐jummī
mīṟi yĕṁtasesedi meludā yemi
jāṟinanībai valabu sallidim̐jummī nīgum̐
bāṟibāṟi nādonĕ paṁtamā yemī
(||tŏyya||)
miṁchina śhrīveṁkaḍādrimem̐ṭi nem̐ jummī yiṁta-
vaṁchanado nāgum̐ jĕppavalĕnā yemi
aṁchĕlam̐ gūḍidi nannu nappuḍesummī yivĕ
pŏṁchibŏṁchi sĕppevu pŏdduvodā yemi