Toyyali neebhaagyamuna doragemgaaga

తొయ్యలి నీభాగ్యమున దొరకెఁగాక
Language

(॥పల్లవి॥)
తొయ్యలి నీభాగ్యమున దొరకెఁగాక
వెయ్యైనా నీపెకు మరి వెల యేదయ్యా

(॥తొయ్య॥)
పలచని పెదవుల బచ్చి తేనియలు గారీ
మొలకలై సెలవుల ముత్యాలు రాలీ
నెలకొన్న చన్నులను నిమ్మపండ్లుప్పతిలీ
వెలఁదిజవ్వనానకు వెలయేదయ్యా

(॥తొయ్య॥)
నెఱిఁగుఱులను మంచినీలపురంగులు మించీ
మెఱుఁగులు మొగమున మేళవించీని
పిఱుఁదు పెంపరసితేఁ బెరసీఁ గరికుంభాలు
మెఱసేయీజవ్వనము మేలువెల యేదయ్యా

(॥తొయ్య॥)
పాదపుసొబగులను పద్మరాగా లొలికీని
పాదుకొనె దేహమెల్లా బంగారువన్నె
యీదెస శ్రీవేంకటేశ యేలితి వీకె నింతలో
యేదైనా యీజవ్వనాన వెల యేదయ్యా

(||pallavi||)
tŏyyali nībhāgyamuna dŏragĕm̐gāga
vĕyyainā nībĕgu mari vĕla yedayyā

(||tŏyya||)
palasani pĕdavula bachchi teniyalu gārī
mŏlagalai sĕlavula mutyālu rālī
nĕlagŏnna sannulanu nimmabaṁḍluppadilī
vĕlam̐dijavvanānagu vĕlayedayyā

(||tŏyya||)
nĕṟim̐guṟulanu maṁchinīlaburaṁgulu miṁchī
mĕṟum̐gulu mŏgamuna meḽaviṁchīni
piṟum̐du pĕṁparasidem̐ bĕrasīm̐ gariguṁbhālu
mĕṟaseyījavvanamu meluvĕla yedayyā

(||tŏyya||)
pādabusŏbagulanu padmarāgā lŏligīni
pādugŏnĕ dehamĕllā baṁgāruvannĕ
yīdĕsa śhrīveṁkaḍeśha yelidi vīgĕ niṁtalo
yedainā yījavvanāna vĕla yedayyā