Tooṟibaaṟi teliyage doddamelu raamgaa raamgaa

తూఱిపాఱి తెలియకే దొడ్డమేలు రాఁగా రాఁగా
Language

(॥పల్లవి॥)
తూఱిపాఱి తెలియకే దొడ్డమేలు రాఁగా రాఁగా
ఆఱడిబెట్టను నేను అంకెకత్తెఁ గానీ

(॥తఱి॥)
చలము సాదించఁగాను సమ్మతించఁ జెప్పేనంటే
పలుకులు చవిగావు పతితోడను
అలిగినదాననై ఆడక వుండుట లేదు
వొలిసి నే గుట్టు సేసుకుందానఁ గానీ

(॥తఱి॥)
పోరచి పంతమాడఁగఁ బొందులు సేసేనంటే
ఆరయ నవ్వులు చవుకలాతనితోను
బీరపుదాననై బిగుసుకుండుట లేదు
వూరటగా గుట్టుసేసుకుందానఁ గానీ

(॥తఱి॥)
సందడిఁ గూడగాఁను సరసములాడేనంటే
విందులనే నోరూరు శ్రీవేంకటేశుతో
మందెమేళపుదాననై మఱచి వుండుట లేదు
వొందిలి గుట్టుసేసుక వుందానఁ గానీ

(||pallavi||)
tūṟibāṟi tĕliyage dŏḍḍamelu rām̐gā rām̐gā
āṟaḍibĕṭṭanu nenu aṁkĕgattĕm̐ gānī

(||taṟi||)
salamu sādiṁcham̐gānu sammadiṁcham̐ jĕppenaṁṭe
palugulu savigāvu padidoḍanu
aliginadānanai āḍaga vuṁḍuḍa ledu
vŏlisi ne guṭṭu sesuguṁdānam̐ gānī

(||taṟi||)
porasi paṁtamāḍam̐gam̐ bŏṁdulu sesenaṁṭe
āraya navvulu savugalādanidonu
bīrabudānanai bigusuguṁḍuḍa ledu
vūraḍagā guṭṭusesuguṁdānam̐ gānī

(||taṟi||)
saṁdaḍim̐ gūḍagām̐nu sarasamulāḍenaṁṭe
viṁdulane norūru śhrīveṁkaḍeśhudo
maṁdĕmeḽabudānanai maṟasi vuṁḍuḍa ledu
vŏṁdili guṭṭusesuga vuṁdānam̐ gānī