తొలుతె మీ తమకము దోసిటిపాలు
(॥పల్లవి॥)
తొలుతె మీ తమకము దోసిటిపాలు
అలరి యింకాఁ బెండ్లి ఆడవయ్య యిపుడు
(॥తొలు॥)
సతికి నీకుఁ జూపుల సరిపొంతనాలుగూడె
చతురత మాట లనె సందివిడేలు
మతకరినవ్వు లనె మంచి పాశాల విందులు
అతిశయమగుఁ బెండ్లి ఆడవయ్య యిపుడు
(॥తొలు॥)
యింతికి నీకు వయసు లిరువంకఁ గంకణాలు
పంతపుఁ దమకములె బాసికములు
కొంతఁ గొంత లేఁతసిగ్గు కొంగులువేసిన ముడి
అంతలో వేడుకపెండ్లి ఆడవయ్య యిపుడు
(॥తొలు॥)
నంటుతోడి సరసాలు నాగవల్లి సోబనాలు
పెంటలైన సమరతి పట్టిన పేఁట
యింటిలో శ్రీవెంకటేశ యీయలమేల్మంగను
అంటి ముట్టి మంచిపెండ్లి ఆడవయ్య యిపుడు
(||pallavi||)
tŏludĕ mī tamagamu dosiḍibālu
alari yiṁkām̐ bĕṁḍli āḍavayya yibuḍu
(||tŏlu||)
sadigi nīgum̐ jūbula saribŏṁtanālugūḍĕ
sadurada māḍa lanĕ saṁdiviḍelu
madagarinavvu lanĕ maṁchi pāśhāla viṁdulu
adiśhayamagum̐ bĕṁḍli āḍavayya yibuḍu
(||tŏlu||)
yiṁtigi nīgu vayasu liruvaṁkam̐ gaṁkaṇālu
paṁtabum̐ damagamulĕ bāsigamulu
kŏṁtam̐ gŏṁta lem̐tasiggu kŏṁguluvesina muḍi
aṁtalo veḍugabĕṁḍli āḍavayya yibuḍu
(||tŏlu||)
naṁṭudoḍi sarasālu nāgavalli sobanālu
pĕṁṭalaina samaradi paṭṭina pem̐ṭa
yiṁṭilo śhrīvĕṁkaḍeśha yīyalamelmaṁganu
aṁṭi muṭṭi maṁchibĕṁḍli āḍavayya yibuḍu